రజనీ ‘జైలర్‌ 2’ మూవీ నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్.. నోరా డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న ‘జైలర్‌ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘బిందాస్‌’ లిరికల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో నోరా ఫతేహి తన ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా రజనీకాంత్‌ కూడా కాసేపు కనిపించి సందడి చేశారు.

30 సెప్టెంబర్, 2026 8:24 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రజనీ ‘జైలర్‌ 2’ మూవీ నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్.. నోరా డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘జైలర్‌ 2’ ఒకటి. ‘జైలర్‌’కు సీక్వెల్‌గా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ‘బిందాస్‌’ పాటను విడుదల చేసింది.

నోరా ఫతేహి డ్యాన్స్‌ హైలైట్‌..

‘బిందాస్‌’ లిరికల్‌ వీడియోలో బాలీవుడ్‌ నటి, డ్యాన్సర్‌ నోరా ఫతేహి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజభవనం తరహాలో వేసిన భారీ సెట్స్‌లో ఆమె చేసిన డ్యాన్స్‌ పాటకు మరింత జోష్‌ తీసుకొచ్చింది. పాటంతా తనదైన స్టైల్‌, ఎనర్జిటిక్‌ మూమెంట్స్‌తో నోరా ఆకట్టుకున్నారు.

‘జైలర్‌’లో తమన్నా భాటియా చేసిన ‘కావాలా’ సాంగ్‌ ఎంతటి క్రేజ్‌ సంపాదించిందో తెలిసిందే. అదే తరహాలో మాస్‌ బీట్‌, అదిరిపోయే డ్యాన్స్‌తో ‘బిందాస్‌’ను రూపొందించినట్లు పాట చూస్తే అర్థమవుతోంది. ఈసారి నోరా ఫతేహి డ్యాన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

పాటలో రజనీ మాస్‌ ఎంట్రీ

‘బిందాస్‌’ వీడియోలో రజనీకాంత్‌ కూడా కొద్దిసేపు కనిపించారు. అయితే సినిమాలో ఈ పాట ఏ సందర్భంలో వస్తుందనే విషయాన్ని మేకర్స్‌ వెల్లడించలేదు. నోరా డ్యాన్స్‌తోపాటు రజనీ కనిపించిన సన్నివేశాలు కూడా పాటపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్‌-అనిరుధ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఇది ఆరో చిత్రం. ‘బిందాస్‌’కు సూపర్‌ సుబు సాహిత్యం అందించగా అనిరుధ్‌, దీప్తి సురేశ్‌ ఆలపించారు. పూర్తి సౌండ్‌ట్రాక్‌ను ‘రేవ్‌’ ఈవెంట్‌ అనంతరం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో అనిరుధ్‌ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

భారీ తారాగణంతో ‘జైలర్‌ 2’

‘జైలర్‌ 2’లో రమ్యకృష్ణ, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, మీర్నా మీనన్‌, యోగిబాబు, జాఫర్‌ సాదిక్‌ తదితరులు తమ పాత్రల్లోనే కనిపించనున్నారు. విద్యాబాలన్‌, ఎస్‌జే సూర్య, సూరజ్‌ వెంజారమూడు, భగవతి పెరుమాళ్‌, తమిళ్‌, జతిన్‌ సర్నా, మేఘనా రాజ్‌ సర్జా, బ్జోర్న్‌ సుర్రావ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 15న థియేటర్లలోకి రానుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు