వయలెన్స్.. హీరోయిజం.. ఎలివేషన్స్.. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ ట్రైలర్ విడుదలైంది. ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. యాక్షన్, వయలెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, భారీ ఎలివేషన్స్‌తో ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది.

5 అక్టోబర్, 2026 7:32 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వయలెన్స్.. హీరోయిజం.. ఎలివేషన్స్.. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ సందడి మొదలైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన ట్రైలర్ సోమవారం విడుదలైంది. ‘జైలర్’లో అదరగొట్టిన టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలోనే రజనీకాంత్ మరోసారి కనిపించనున్నారు.

ట్రైలర్ మొత్తం రజనీకాంత్ హీరోయిజం, మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో నిండిపోయింది. మొదటి భాగంలో జరిగిన పరిణామాల తర్వాత ముత్తువేల్ పాండియన్ అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. సాధారణ క్యాబ్ డ్రైవర్‌గా జీవిస్తున్న అతడిని వెతుక్కుంటూ శత్రువులు రావడంతో కథ మళ్లీ కీలక మలుపు తిరుగుతుంది.

శత్రువుల వేట.. ముత్తువేల్ పాండియన్ రిటర్న్

వర్మను హతమార్చిన జైలర్ కోసం పలువురు శత్రువులు వెతుకుతుంటారు. అయితే తన గురించి ఎవరికీ తెలియకుండా ముత్తువేల్ సాధారణ జీవితం గడుపుతుంటాడు. చివరకు అతడిని శత్రువులు గుర్తించడంతో అసలు కథ మొదలవుతుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన వారిని ముత్తువేల్ ఎలా ఎదుర్కొన్నాడు? అందరినీ ఒకే చోట చేర్చి ఎలా దెబ్బతీశాడు? అనేదే ‘జైలర్ 2’ కథాంశంగా కనిపిస్తోంది.

యాక్షన్, వయలెన్స్ మరింత ఎక్కువ

‘జైలర్’తో పోలిస్తే సీక్వెల్‌లో యాక్షన్, వయలెన్స్ మరింత ఎక్కువగా ఉండబోతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. సినిమాలో పలువురు విలన్లు కనిపించనున్నారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజారమూడు, మిథున్ చక్రవర్తి కీలక ప్రతినాయక పాత్రల్లో నటిస్తున్నారు. విద్యాబాలన్ బోల్డ్ లుక్‌లో కనిపించడం ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘జైలర్’లో గెస్ట్ అప్పియరెన్స్‌లతో మెప్పించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ కూడా సీక్వెల్‌లో కనిపించనున్నారు.

రూ.400 కోట్ల భారీ బడ్జెట్

సన్ పిక్చర్స్ సంస్థ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తోంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ‘జైలర్ 2’ తెరకెక్కినట్లు సమాచారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ విడుదల చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో ‘జైలర్ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు