దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘సిగ్మా’. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ అదే టైటిల్‌తో విడుదల కానుంది.
సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో ఈవెంట్
జాసన్ సంజయ్ డెబ్యూ మూవీ కావడంతో ‘సిగ్మా’పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేథరిన్ స్పెషల్ సాంగ్
‘సిగ్మా’లో కేథరిన్ ట్రెసా ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. సంపత్, రాజు సుందరం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు తమన్ సంగీతం అందించారు. వాస్తవానికి ‘సిగ్మా’ను జూలైలోనే విడుదల చేయాలని మేకర్స్ తొలుత భావించారు. అయితే అదే సమయంలో దళపతి విజయ్ నటించిన ‘జననాయకన్’ విడుదల నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ప్రస్తుతం ‘సిగ్మా’ను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న జాసన్ సంజయ్ ఇందులో ఓ అతిథి పాత్రలోనూ కనిపించనున్నట్లు సమాచారం. దర్శకుడిగా ఆయన తొలి ప్రయత్నం కావడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.





















