పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా గురించి ఈ విషయాలు తెలుసా?.. కొన్ని వందల కోట్లకు మహారాణి..!

పవన్ కళ్యాణ్ రాజకీయ, సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ఆయన సతీమణి అన్నా లెజినోవా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. రష్యన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అన్నా.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తన వ్యక్తిగత విజయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె జీవితం, ఆస్తులు, పవన్ కళ్యాణ్‌కు అండగా నిలిచిన ప్రయాణం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

1 ఆగస్టు, 2026 9:11 AM•ByLaharika

Share this article

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా గురించి ఈ విషయాలు తెలుసా?.. కొన్ని వందల కోట్లకు మహారాణి..!

సినిమాల్లో పవర్ స్టార్‌గా, రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆయన మూడో భార్య, మాజీ రష్యన్ మోడల్ అన్నా లెజినోవా గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి కనిపిస్తుంది. ఎక్కువగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ఆమె జీవితం గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. 'తీన్‌మార్' సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, 2013 సెప్టెంబర్ 30న ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2017లో వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు.

అన్నా లెజినోవా గతంలో మోడల్‌, నటిగా పనిచేసినా.. ఆమె సింగపూర్‌లో హాస్పిటాలిటీ రంగంలో ఉన్నట్లు సమాచారం. అక్కడ ఆమెకు హోటల్ వ్యాపారాలతో పాటు రష్యా, సింగపూర్‌లో విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రచారం ఉంది. ఇక ఆమె మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. అలాగే 2024 జూలైలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది అన్నా లెజినోవా.

పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో విమర్శలు, ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రతి దశలో అన్నా లెజినోవా ఆయనకు అండగా నిలిచింది. ముఖ్యంగా రాజకీయ విజయాల సమయంలో కుటుంబంతో కలిసి సంబరాలు జరుపుకోవడం చూడముచ్చటగా అనిపించింది. అన్నా కంటే ముందు ముందు పవన్ కళ్యాణ్ 1997లో నందినిని వివాహం చేసుకోగా, 2008లో ఇద్దరూ విడిపోయారు. అనంతరం 2009లో నటి రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి అకిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2012లో ఆ బంధం కూడా ముగిసింది. ఆ తర్వాత పవన్ జీవితంలోకి వచ్చిన అన్నా లెజినోవా ఆయనకు బలమైన మద్దతుగా నిలిచింది.

అన్నా లెజినోవా హిందూ సంప్రదాయాల పట్ల కూడా ప్రత్యేకమైన గౌరవం చూపిస్తుంటారు. ఆ మధ్య తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి ఒక భావోద్వేగ కారణం కూడా ఉంది. సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో కుమారుడు మార్క్ శంకర్ గాయపడినా, సురక్షితంగా కోలుకుని ఇంటికి రావడంతో మొక్కు తీర్చుకునేందుకు ఆమె తిరుమలకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన ఆమెకు దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని, కుటుంబంపై ఉన్న ప్రేమను మరోసారి చాటిచెప్పింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు