నాకు గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు..నేను ఎవరికీ బినామీని కాదు..ఐటీ సోదాలపై రకుల్‌ప్రీత్ సింగ్ క్లారిటీ

హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, ఆమె భర్త వసు భగ్నానీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయన్న వార్తలపై రకుల్ స్పందించింది. తాను ఎవరికీ బినామీ కాదని, తనకు కోట్ల విలువైన ఆస్తులను ఎవరూ బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేయొద్దని కోరింది.

5 అక్టోబర్, 2026 2:39 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నాకు గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు..నేను ఎవరికీ బినామీని కాదు..ఐటీ సోదాలపై రకుల్‌ప్రీత్ సింగ్ క్లారిటీ

హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఐటీ సోదాల వార్తలపై స్పందించింది. ఇటీవల రకుల్‌తో పాటు ఆమె భర్త వసు భగ్నానీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. విదేశాలకు అక్రమంగా నిధుల మళ్లింపు వ్యవహారంలో ఈ సోదాలు జరిగినట్లు ప్రచారం సాగింది. దీనిపై రకుల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది.

‘నేను ఎవరికీ బినామీని కాదు’

తాను ఎవరికీ బినామీగా వ్యవహరించడం లేదని రకుల్ స్పష్టం చేసింది. తనకు ఎవరూ కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదని పేర్కొంది. నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు సంచలనం కోసం అసత్యాలు, కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

‘నాకు గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు’

తాను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చానని రకుల్ తెలిపింది. తన తండ్రి చాలా ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసి దేశానికి సేవ చేశారని చెప్పింది. సినీ పరిశ్రమలో తనకు ఎలాంటి గాడ్‌ఫాదర్లు లేరని, సొంత కష్టాన్ని నమ్ముకుని ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొంది. పన్నుల చెల్లింపు విషయంలో ఎప్పుడూ తన బాధ్యతను విస్మరించలేదని రకుల్ తెలిపింది. 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నానని వెల్లడించింది.

‘అక్రమ నిధుల బదిలీలతో నాకు సంబంధం లేదు’

ఏ నిర్మాణ సంస్థ తరఫున తాను వ్యక్తిగతంగా ఎలాంటి నిధుల అవకతవకలకు పాల్పడలేదని రకుల్ స్పష్టం చేసింది. విదేశాలకు అక్రమంగా నిధులు బదిలీ చేయలేదని తెలిపింది. తనపై వస్తున్న ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తనకు ఎవరూ ఖరీదైన ఆస్తులు లేదా బహుమతులు ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేసిన రకుల్.. ఖరీదైన గిఫ్టులు స్వీకరించే అలవాటు కూడా తనకు లేదని చెప్పింది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని మీడియా, సోషల్ మీడియా వర్గాలను కోరింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు