Sowcar Janaki: ప్రముఖ నటి షావుకారు జానకికి అనారోగ్యం..ఐసీయూలో చికిత్స

ప్రముఖ సీనియర్‌ సినీ నటి షావుకారు జానకి అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

20 ఆగస్టు, 2026 1:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Sowcar Janaki: ప్రముఖ నటి షావుకారు జానకికి అనారోగ్యం..ఐసీయూలో చికిత్స

చెన్నై: ఆగస్టు 20 (జనవాణి): ప్రముఖ సీనియర్‌ నటి షావుకారు జానకి అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ICU)లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొంతకాలంగా షావుకారు జానకి వృద్ధాప్యంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

400కు పైగా చిత్రాల్లో నటన

షావుకారు జానకి అసలు పేరు టేకుమళ్ల జానకి. 1931 డిసెంబర్‌ 12న ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో జన్మించారు. వివాహం అనంతరం సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె.. అంతకుముందు నాటక రంగంలోనూ రాణించారు. సీనియర్‌ నటి కృష్ణకుమారికి చెల్లెలు అవుతారు. జానకి తొలి చిత్రం ‘షావుకారు’. ఈ సినిమా విజయవంతం కావడంతో జానకి పేరుకు ‘షావుకారు’ అనే పేరు స్థిరపడింది. అప్పటినుంచి ఆమె షాపుకారు జానకిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

కన్యాశుల్కం, రోజులు మారాయి, డాక్టర్‌ చక్రవర్తి, భాగ్యరేఖ, మంచి కుటుంబం, సంసారం ఒక చదరంగం, కటకటాల రుద్రయ్య, తోడికోడళ్లు, బాబు బంగారం తదితర చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. వయసు పైబడిన తర్వాత కూడా సహాయక పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘ఓపిక ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటా’ అని షావుకారు జానకి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లోనూ ఆమె కొన్ని చిత్రాల్లో కనిపించారు. సినీ రంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ప్రస్తుతం షావుకారు జానకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు