తల్లి అవ్వాలంటే పెళ్లే చేసుకోవాలా?.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి, మాతృత్వం విషయంలో తన ఆలోచనలను ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె బహిరంగంగా వెల్లడించింది. తల్లి కావడానికి పెళ్లి తప్పనిసరి కాదని, పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

23 సెప్టెంబర్, 2026 6:47 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తల్లి అవ్వాలంటే పెళ్లే చేసుకోవాలా?.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లి బాజాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పలువురు హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే.. మరికొందరు మాత్రం సింగిల్‌గానే ఉంటూ కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా ఒకరు.

స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్ నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్ తన వ్యక్తిగత జీవితం, వివాహం, మాతృత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తల్లి కావాలంటే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిందేనా? అనే ప్రశ్నపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. తల్లి కావడానికి ప్రస్తుతం ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయని శ్రుతిహాసన్ తెలిపింది. పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. అదే సమయంలో తన జీవితంలో సహజంగా కూడా తల్లి కావాలనే కోరిక ఉందని వెల్లడించింది.

అయితే తాను పెళ్లి వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకం కాదని శ్రుతిహాసన్ స్పష్టం చేసింది. తన జీవితంలో తనకు తోడుగా నిలిచే సరైన భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది. తాను అన్ని విషయాల్లో ఒకే విధమైన ఆలోచనలతో ఉండనని.. కొన్ని విషయాల్లో సంప్రదాయాలను పాటిస్తానని, మరికొన్ని విషయాల్లో తనకు నచ్చిన విధంగా ఉంటానని శ్రుతిహాసన్ పేర్కొంది. అయితే ఏ విషయంలోనూ తనపై ఎవరూ బలవంతం చేయరని తెలిపింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు