తమిళనాడు సీఎం విజయ్ వారసుడి డైరెక్షన్‌లో ‘సిగ్మా’..ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గ్యాంబ్లింగ్, డ్రగ్స్, మనీ హైస్ట్ నేపథ్యంలో సాగుతున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

19 సెప్టెంబర్, 2026 5:57 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తమిళనాడు సీఎం విజయ్ వారసుడి డైరెక్షన్‌లో ‘సిగ్మా’..ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

ట్రైలర్‌ను పరిశీలిస్తే గ్యాంబ్లింగ్, డ్రగ్స్, మనీ హైస్ట్ అంశాల చుట్టూ సాగే క్రైమ్ యాక్షన్ డ్రామాగా ‘సిగ్మా’ తెరకెక్కినట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ ఇందులో వైవిధ్యమైన రేడియో జాకీ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు అండర్ వరల్డ్ డాన్‌గా సంపత్ రాజ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించగా దాన్ని దెబ్బతీసేందుకు హీరో చేపట్టే సాహసోపేతమైన మిషన్ చుట్టూ కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ హింట్ ఇచ్చింది.

ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్, వేగవంతమైన కథనం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది.

ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నారు. సంపత్ రాజ్, శివ్ పండిట్, రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ‘సిగ్మా’ను 2026 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు