నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో లో కేసీఆర్‌?

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మిక్స్‌డ్ టాక్ కొనసాగుతుండగా.. సెకండాఫ్‌లోని కొన్ని పొలిటికల్ రిఫరెన్సులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కేసీఆర్‌ను పోలిన ‘శంకరన్న’ పాత్ర, ఎన్టీఆర్‌ను పోలిన మరో పాత్రపై నెటిజన్లు చర్చిస్తున్నారు.

24 సెప్టెంబర్, 2026 4:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో లో కేసీఆర్‌?

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. నాని మేకోవర్, యాక్షన్ సీన్లు, డ్యాన్సులు, భాష, యాస కోసం ఆయన చేసిన ప్రయత్నాలకు ప్రశంసలు దక్కుతున్నా.. కథ, కొన్ని సన్నివేశాలు, ఎమోషనల్ ట్రాక్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కనిపించే కొన్ని పొలిటికల్ రిఫరెన్సులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

కేసీఆర్‌ను పోలిన ‘శంకరన్న’ పాత్ర

1980–85 కాలం నాటి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో తెలంగాణ మాస్ లీడర్‌ను పోలిన ‘శంకరన్న’ పాత్రలో ప్రియదర్శి నటించారు. ఈ పాత్ర ఎంట్రీకి థియేటర్లలో మంచి స్పందన వచ్చినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే శంకరన్న పాత్ర గెటప్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా కేసీఆర్‌ను పోలినట్లుగా కనిపించే ముక్కు, మేకప్ విషయంలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ సన్నివేశంలో ఆ ముక్కు ఊడిపోతున్నట్లు కనిపించడం కూడా చర్చకు కారణమవుతోంది. దీంతో ఈ పాత్రను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేసేలా డిజైన్ చేశారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

paradise

ఎన్టీఆర్‌ను పోలిన పాత్ర కూడా..

మరోవైపు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును పోలిన పాత్ర కూడా సినిమాలో కనిపిస్తుంది. ఈ పాత్రలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫేమ్ పి. విజయ్ కుమార్ నటించారు. ఆయన ఎంట్రీకి కూడా థియేటర్లలో విజిల్స్, కేకలు వినిపించినట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాలోని ఈ రెండు పాత్రలపై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. వాస్తవ రాజకీయ నాయకులను పోలిన పాత్రలను సినిమాలో ఎలా చూపించారనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

రాజకీయ రిఫరెన్సులపై చర్చ

శంకరన్న పాత్రకు సినిమాలో గణనీయమైన ప్రాధాన్యం ఉండటంతో ఆ పాత్రను కేసీఆర్‌కు అనుసంధానిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పాత్రపై రాజకీయంగా కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే 1983 నాటి సికింద్రాబాద్ నియోజకవర్గ రాజకీయాలకు సంబంధించినట్లు కనిపించే కొన్ని రిఫరెన్సులు కూడా సినిమాలో ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై రాజకీయ పార్టీలు, కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tweet1
Tweet2
Tweet3

చిత్ర యూనిట్ ముందే Disclaimer ఇచ్చింది

అయితే సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, ప్రాంతాలు కల్పితమైనవేనని చిత్ర ప్రారంభంలోనే చిత్ర యూనిట్ డిస్క్లైమర్ ఇచ్చింది. అయినప్పటికీ కొన్ని పాత్రల గెటప్‌లు వాస్తవ రాజకీయ నాయకులను పోలి ఉండటంతో విడుదల రోజునే ఈ అంశం చర్చకు వచ్చింది. మరోవైపు సినిమా నిర్మాణంలో హడావుడి కనిపించిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ అభిప్రాయాలు, ఆరోపణలపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక వివరణ ఇవ్వలేదు. ‘ది ప్యారడైజ్’లోని పొలిటికల్ రిఫరెన్సులపై చిత్రబృందం స్పందిస్తుందా? అనేది చూడాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు