సీరియల్‌లో తల్లి.. రియల్ లైఫ్‌లో భార్య.. ఈ నటి లవ్‌స్టోరీ తెలిస్తే షాక్ అవడం పక్కా..!

సినిమాలు, సీరియల్స్‌లో కలిసి నటిస్తూ ప్రేమలో పడిన జంటలు చాలామందే ఉన్నారు. కానీ ఓ సీరియల్‌లో తల్లి, కొడుకులుగా నటించిన ఇద్దరు నటీనటులు నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా అరుదు. వయసు, మతం వంటి అడ్డంకులను దాటుకుని ఒక్కటైన కిశ్వర్ మర్చెంట్, సుయాష్ రాయ్ ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

1 ఆగస్టు, 2026 6:39 AM•ByLaharika

Share this article

సీరియల్‌లో తల్లి.. రియల్ లైఫ్‌లో భార్య.. ఈ నటి లవ్‌స్టోరీ తెలిస్తే షాక్ అవడం పక్కా..!

సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలో కలిసి నటిస్తూ ప్రేమలో పడిన జంటలు చాలా మంది ఉన్నా.. ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమకథ మాత్రం చాలా ప్రత్యేకం. ఓ సీరియల్‌లో తల్లీ, కొడుకులుగా నటించిన ఇద్దరు ఆర్టిస్టులు నిజజీవితంలో భార్యాభర్తలయ్యారు. హిందీ సీరియల్ 'ప్యార్ కి యే ఏక్ కహానీ'లో హసీనా రాయ్‌చంద్ అనే తల్లి పాత్రలో కిశ్వర్ మర్చెంట్ నటించగా, ఆమె కొడుకుగా సుయాష్ రాయ్ కనిపించాడు. 2010-11 మధ్య ప్రసారమైన ఈ సీరియల్‌తో ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ పరిచయం ప్రేమగా మారి, తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన సుయాష్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు కిశ్వర్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

వీరి ప్రేమకు వయసు మాత్రమే కాదు, మతం కూడా అడ్డంకిగా నిలిచింది. కిశ్వర్ ముస్లిం కాగా, సుయాష్ హిందూ పంజాబీ కుటుంబానికి చెందినవాడు. అయినా ప్రేమ ముందు ఈ భేదాలను పట్టించుకోలేదు. నిజానికి 2016కు ముందే పెళ్లి జరగాల్సి ఉన్నా, వయసు తేడా కారణంగా సుయాష్ తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదట. తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించడంతో చివరకు ఇద్దరూ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మతం తమ బంధానికి ఎప్పుడూ అడ్డుగా రాలేదని కిశ్వర్ కూడా పలు సందర్భాల్లో వెల్లడించింది.

పెళ్లి తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఉన్న ఎనిమిదేళ్ల వయసు తేడాపై నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ జీవితాన్ని ఆనందంగా కొనసాగించారు. 2021లో వీరికి నిర్వయర్ అనే కుమారుడు జన్మించాడు. తమ కుమారుడికి రెండు మతాల సంప్రదాయాలను పరిచయం చేస్తూ కిశ్వర్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఒకసారి రుద్రాక్షతో, మరోసారి ముస్లిం టోపీతో ఉన్న చిన్నారి ఫొటోలు షేర్ చేయగా, వాటిపైనా ట్రోలింగ్ జరిగింది.

కిశ్వర్ మర్చెంట్ టెలివిజన్ రంగంలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 'ప్యార్ కి యే ఏక్ కహానీ'తో పాటు 'హిప్ హిప్ హుర్రే', 'ఏక్ హసీనా థీ', 'ఇత్నా కరో నా ముజే ప్యార్', 'హర్ ముష్కిల్ కా హల్ అక్బర్ బీర్బల్', 'కైసీ యే యారియాన్' వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. హిందీ బిగ్‌బాస్ సీజన్-9లో కంటెస్టెంట్‌గా పాల్గొనడంతో పాటు 'భేజా ఫ్రై 2', 'మార్నే భీ దో యారో' వంటి సినిమాల్లో నటించింది. అలాగే 2023లో విడుదలైన 'డియర్ ఇష్క్' వెబ్‌సిరీస్‌లో మాయా కోస్టా పాత్రతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు