భూమి మార్పిడి కోసం లంచం.. తహసీల్దార్‌ను పట్టుకున్న ఏసీబీ

ములుగు జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. గోవిందరావుపేట మండల తహసీల్దార్ సృజన్‌కుమార్ భూమిని కుటుంబసభ్యుల పేర్లపై మార్చేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

18 సెప్టెంబర్, 2026 4:23 PM•ByNarender Kumar Nangunoori

Share this article

భూమి మార్పిడి కోసం లంచం.. తహసీల్దార్‌ను పట్టుకున్న ఏసీబీ

ములుగు,సెప్టెంబర్ 18 (జనవాణి): తరచూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు, అరెస్టులు జరుగుతున్నప్పటికీ లంచాలకు పాల్పడుతున్న అధికారుల తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో మరో అధికారి ఏసీబీ వలకు చిక్కారు.

గోవిందరావుపేట మండల తహసీల్దార్ సృజన్‌కుమార్ తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమిని కుటుంబసభ్యుల పేర్లపై మార్చేందుకు ఓ రైతు నుంచి రూ.14 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గోవిందరావుపేట మండలానికి చెందిన ఓ రైతు తన కుటుంబసభ్యుల పేర్లపై ఎకరం 10 గుంటల భూమిని మార్చేందుకు తహసీల్దార్‌ను సంప్రదించాడు. ఈ ప్రక్రియ కోసం సృజన్‌కుమార్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

రైతు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో వల పన్నారు. రైతు నుంచి సృజన్‌కుమార్ రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు