డ్రగ్స్ సమాచారం పోలీసులకు ఇస్తున్నాడనే అనుమానం.. స్నేహితుడినే కత్తులతో పొడిచి హత్య!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో స్నేహితులే వసీం అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలోనూ ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు సమాచారం.

24 సెప్టెంబర్, 2026 9:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

డ్రగ్స్ సమాచారం పోలీసులకు ఇస్తున్నాడనే అనుమానం.. స్నేహితుడినే కత్తులతో పొడిచి హత్య!

Social Media Image

రాజేంద్రనగర్,సెప్టెంబర్ 24 (జనవాణి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ విక్రయాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో స్నేహితులే ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ అపార్ట్‌మెంట్ కాలనీలో వసీం అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వసీంతో పాటు హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న నిందితులపై గతంలో ఎన్డీపీఎస్ (NDPS) కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ సమాచారం లీక్ చేస్తున్నాడనే అనుమానం

డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని వసీం కావాలనే పోలీసులకు చేరవేస్తున్నాడని అతని స్నేహితులు అనుమానించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో కొంతకాలంగా వసీం, నిందితుల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం వసీం, అతని స్నేహితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన నిందితులు కత్తులతో వసీంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన వసీం అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్య వెనుక డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యవహారం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వసీం, నిందితుల మధ్య ఉన్న సంబంధాలు, గతంలో నమోదైన కేసులు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. స్నేహితుల మధ్య ఏర్పడిన అనుమానాలు, విభేదాలు చివరకు హత్యకు దారితీయడం రాజేంద్రనగర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు