శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. ప్రయాణికుడి అరెస్ట్

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద సుమారు 800 గ్రాముల బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. దీని విలువ దాదాపు రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

5 అక్టోబర్, 2026 2:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. ప్రయాణికుడి అరెస్ట్

హైదరాబాద్, అక్టోబర్ 5 జనవాణి): హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం ఉదయం తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

తనిఖీల్లో అతడి వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించిన అధికారులు సుమారు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.1.20 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

అనంతరం ప్రయాణికుడిని తదుపరి విచారణ నిమిత్తం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నిస్తున్నారు. బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దాని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు