శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ..శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు మాయం

వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ కలకలం రేపింది. రాములవారి గుడిలోని శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి.

26 సెప్టెంబర్, 2026 12:24 PM•ByNarender Kumar Nangunoori

Share this article

శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ..శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు మాయం

వనపర్తి,సెప్టెంబర్ 26 (జనవాణి): వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని రాములవారి గుడిలో ఉన్న మూడు పంచలోహ విగ్రహాలు మాయమయ్యాయి. శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి.

విగ్రహాలు కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ కూడా ఆలయానికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

దుండగులు ఆలయంలోకి ఎలా ప్రవేశించారు? చోరీ ఎప్పుడు జరిగింది? ఘటన వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆలయంలోని భద్రతా ఏర్పాట్లు, పరిసర ప్రాంతాల్లోని పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నారు. చోరీకి గురైన విగ్రహాల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు