బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష

హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పరిధిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎల్‌.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్‌, పోక్సో కేసుల ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.25,500 జరిమానాతో పాటు బాధితుడికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.

29 సెప్టెంబర్, 2026 1:50 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనవాణి): 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎల్‌.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్‌, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడికి రూ.25,500 జరిమానా విధించడంతో పాటు బాధితుడికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.

పహాడీషరీఫ్‌ సీఐ సీహెచ్‌. జితేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం మామిడిపల్లిలోని ఇస్లామియా కాషిఫుల్ ఉలూమ్ మదర్సాలో 13 ఏళ్ల బాలుడు చదువుకుంటున్నాడు. అనారోగ్యానికి గురికావడంతో 2024 డిసెంబర్‌ 26న అతడిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు క్లినిక్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా బాలుడి రహస్య అవయవాల వద్ద తీవ్ర ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిని ప్రశ్నించగా బాలుడు జరిగిన విషయాన్ని వెల్లడించాడు.

బీహార్‌లోని పూర్ణియా జిల్లా దరియాపూర్‌ గ్రామానికి చెందిన హఫీజ్‌ మునావర్‌ హుస్సేన్‌ (32) మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మామిడిపల్లిలోనే నివాసం ఉంటున్నాడు. 2024 డిసెంబర్‌ 25న సాయంత్రం బాలుడిని వాహనంపై పహాడీషరీఫ్‌ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో మసీద్‌-ఎ-రహమత్‌ ఉన్నీసా సమీపంలోని ఓ గదికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బెదిరింపులకు గురిచేసినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ఘటన గురించి బాలుడు తన తల్లికి చెప్పడంతో ఆమె తన భర్తకు సమాచారం అందించింది. అనంతరం బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పహాడీషరీఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కృష్ణ ప్రసన్న వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైనట్లు నిర్ధారించి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.25,500 జరిమానా విధించింది. బాధితుడికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు