ప్రభుత్వ స్కూళ్ల మధ్యాహ్న భోజనంలో చేపలు.. తెలంగాణ ప్రభుత్వం ఆలోచన వెల్లడించిన మంత్రి వాకిటి శ్రీహరి

విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

4 ఆగస్టు, 2026 4:30 PM•ByRalin

Share this article

ప్రభుత్వ స్కూళ్ల మధ్యాహ్న భోజనంలో చేపలు.. తెలంగాణ ప్రభుత్వం ఆలోచన వెల్లడించిన మంత్రి వాకిటి శ్రీహరి

మినిస్టర్స్ కార్వర్ట్స్‌లో మత్స సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో సమావేశమైన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌, ఆగస్టు 4: రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో సమావేశమైన ఆయన మత్స్యకారుల సమస్యలు, మౌలిక వసతులు, చేపల ఉత్పత్తి పెంపు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్‌, మోపెడ్‌లు, రిటైల్‌ అవుట్‌లెట్‌ షాపుల ఏర్పాటు కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షిస్తామని చెప్పారు.

చేప పిల్లల పంపిణీ కొనసాగింపు

ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు, మత్స్యకారులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిల విడుదలకు ప్రత్యేక కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రూ.1.34 కోట్ల విలువైన ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను ప్రభుత్వం పరిష్కరించినట్లు వెల్లడించారు.

మధ్యాహ్న భోజనంలో చేపలు?

విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు మత్స్యకారులకు మార్కెట్‌ అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లోని కోహెడలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ ఫిష్‌ మార్కెట్ పూర్తయితే ఆన్‌లైన్‌ ద్వారా చేపల విక్రయాలు, పంపిణీకి అవకాశం కలుగుతుందని మంత్రి చెప్పారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న మత్స్య సహకార సంఘాల సభ్యత్వ వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, సంఘాల అధ్యక్షులకు ప్రోటోకాల్‌ అంశాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు