ఇంజినీరింగ్‌లో సీటు రాలేదా.. భవిష్యత్తు మార్చే హైటెక్ కోర్స్ ఇదే! కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇది శుభవార్త. భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, స్మార్ట్ ఫార్మింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను బోధించే B.Sc Agritech (Hons.) కోర్సు ఇప్పుడు విద్యార్థులకు కొత్త కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండానే ఈ కోర్సులో చేరే అవకాశం ఉండటం విశేషం.

24 జులై, 2026 2:19 PM•ByGovardhan Reddy

Share this article

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదా..  భవిష్యత్తు మార్చే హైటెక్ కోర్స్ ఇదే! కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్

హైదరాబాద్ (తెలంగాణ): మారుతున్న సాంకేతిక ప్రపంచంలో వ్యవసాయ రంగం కూడా పూర్తిగా రూపాంతరం చెందుతోంది. డ్రోన్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీలు వ్యవసాయాన్ని మరింత ఆధునికంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ వ్యవసాయ విద్యకు సాంకేతికతను జోడిస్తూ రూపొందించిన B.Sc Agritech (Hons.) కోర్సు విద్యార్థులకు సరికొత్త అవకాశాలను తెరుస్తోంది.

ఒకప్పుడు వ్యవసాయం పూర్తిగా శారీరక శ్రమపై ఆధారపడితే, ఇప్పుడు డ్రోన్‌లతో పంటలపై మందులు పిచికారీ చేయడం, సెన్సార్లతో నేల తేమను కొలవడం, AI ద్వారా పంటల వ్యాధులను ముందుగానే గుర్తించడం వంటి టెక్నాలజీలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రి-టెక్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.

దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేక కోర్సు

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన B.Sc Agritech (Hons.) కోర్సు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఇందులో వ్యవసాయ శాస్త్రంతో పాటు వెబ్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్, స్మార్ట్ ఫార్మింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్ వంటి ఆధునిక అంశాలను బోధిస్తున్నారు.

క్యాంపస్‌లోనే డ్రోన్ ట్రైనింగ్

ఈ కోర్సులో భాగంగా DGCA ఆమోదిత డ్రోన్ ట్రైనింగ్ క్యాంపస్‌లోనే అందిస్తున్నారు. డ్రోన్ ఆపరేషన్, సర్వేయింగ్, అగ్రికల్చర్ స్ప్రేయింగ్ వంటి అంశాల్లో శిక్షణతో పాటు సర్టిఫికేషన్ కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ శిక్షణ పొందిన విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను పొందుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్

వర్మీ కంపోస్టింగ్ సర్టిఫికేషన్, ఆధునిక అగ్రికల్చర్ ల్యాబ్స్, ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్, హైటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సదుపాయాలు ఈ కోర్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చదువుతున్నప్పుడే పరిశ్రమ అనుభవాన్ని అందించే విధంగా కోర్సు రూపకల్పన చేశారు.

ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?

అగ్రి-టెక్ కంపెనీలు, డ్రోన్ సర్వీసెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్, డిజిటల్ అగ్రికల్చర్, అగ్రి స్టార్టప్‌లు, రీసెర్చ్ సంస్థల్లో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశాలు పెరుగుతున్నాయి. డ్రోన్ ఆపరేటర్లు, అగ్రి టెక్ స్పెషలిస్టులు, స్మార్ట్ ఫార్మింగ్ కన్సల్టెంట్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

కెరీర్ గైడెన్స్ కూడా అందుబాటులో

ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థుల ఆసక్తి, నైపుణ్యాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని సరైన కోర్సు ఎంపిక చేసుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. College Mentor ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు కెరీర్ కౌన్సెలింగ్, కోర్సు ఎంపిక, అడ్మిషన్ ప్రక్రియపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తోంది.

మరిన్ని వివరాల కోసం 92814 16210 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు