గణేష్ మాల ధరించి స్కూల్‌కు వెళ్లిన అక్కాతమ్ముడిని అడ్డుకున్న టీచర్లు..స్కూల్‌కు రావొద్దంటూ ఆంక్షలు?

హనుమకొండలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా వినాయక మాల ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్న ఘటన వివాదాస్పదంగా మారింది. మాల విరమణ చేసిన తర్వాతే స్కూల్‌కు రావాలని చెప్పడంతో విద్యార్థుల తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నాయకులు పాఠశాలకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

16 సెప్టెంబర్, 2026 12:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గణేష్ మాల ధరించి స్కూల్‌కు వెళ్లిన అక్కాతమ్ముడిని అడ్డుకున్న టీచర్లు..స్కూల్‌కు రావొద్దంటూ ఆంక్షలు?

హనుమకొండ,సెప్టెంబర్ 16 (జనవాణి): గణేష్‌ నవరాత్రుల సందర్భంగా వినాయక మాల ధరించి పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులను టీచర్లు అడ్డుకున్న ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడు మంగళవారం గణేష్‌ మాల, కండువా ధరించి మాదిరెడ్డికుంటలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలకు వెళ్లారు. అయితే పాఠశాలలో టీచర్లు వారిని అడ్డుకుని మాల ధరించి స్కూల్‌కు రావొద్దని సూచించినట్లు విద్యార్థుల తండ్రి కె. శ్రీకాంత్‌ తెలిపారు. మాల విరమణ చేసిన తర్వాతే పాఠశాలకు రావాలని చెప్పినట్లు ఆరోపించారు. పిల్లలు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో వెంటనే పాఠశాలకు వెళ్లిన శ్రీకాంత్‌.. టీచర్లను ప్రశ్నించారు. విద్యార్థులు ఆధ్యాత్మిక మాలలు ధరించి పాఠశాలకు రావడం ఇబ్బందిగా ఉంటుందని సిబ్బంది చెప్పినట్లు ఆయన తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులను ఎందుకు అడ్డుకున్నారని యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో పాఠశాల ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే విద్యార్థులు గణేష్‌ మాలలు ధరించడాన్ని తాము నిషేధించలేదని పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు సమాచారం. కొన్ని అనివార్య కారణాల వల్ల మాలలు ధరించి రావడం ఇబ్బందిగా ఉంటుందని మాత్రమే చెప్పామని తెలిపినట్లు పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు