జేఈఈ మెయిన్‌ 2027 షెడ్యూల్‌ వచ్చేసింది.. జనవరి 22 నుంచే పరీక్షలు!

NTA Exam Schedule: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్‌ 2027 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి.

17 సెప్టెంబర్, 2026 5:55 PM•ByNarender Kumar Nangunoori

Share this article

జేఈఈ మెయిన్‌ 2027 షెడ్యూల్‌ వచ్చేసింది.. జనవరి 22 నుంచే పరీక్షలు!

సెప్టెంబర్ 17 (జనవాణి): దేశవ్యాప్తంగా నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక పరీక్షల షెడ్యూల్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. డిసెంబర్‌ 2026 నుంచి మార్చి 2027 వరకు నిర్వహించనున్న వివిధ పరీక్షల తేదీలను ఇందులో పేర్కొంది.

జనవరి 22 నుంచి JEE Main

ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE Main 2027 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22-24, 28-30 తేదీల్లో మొత్తం ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నట్లు NTA తెలిపింది. దీనికి సంబంధించి వచ్చే నెలలో పరీక్ష నోటిఫికేషన్‌ వెలువడనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, పరీక్షా విధానం, ఇతర వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది.

ఏప్రిల్‌లో రెండో విడత

JEE Main రెండో విడత పరీక్షల తేదీలను NTA ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ పరీక్షలు 2027 ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. రెండో విడతకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను NTA తర్వాత వెల్లడించనుంది.

JEE Mainలో నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థుల్లో 2.50 లక్షల మందికి JEE Advanced రాసే అవకాశం లభిస్తుంది. JEE Advancedలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో బీటెక్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తేదీల్లో మార్పులు ఉండొచ్చు

ప్రస్తుతం ప్రకటించిన తేదీలు తాత్కాలికమైనవేనని NTA స్పష్టం చేసింది. పరిపాలనా, విద్యా, చట్టపరమైన, లాజిస్టిక్స్‌ కారణాలతో పాటు ఇతర అనుకోని పరిస్థితులు తలెత్తితే పరీక్షల తేదీల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది. అభ్యర్థులు తుది షెడ్యూల్‌, నోటిఫికేషన్లు, దరఖాస్తు తేదీలు, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాల కోసం NTA అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది.

  • NTA Examination Calendar | 2026–27

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు