తెలంగాణ పేదింటి విద్యార్థినులకు ఫ్రీగా పైలట్ అయ్యే అవకాశం

తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలకు కమర్షియల్ పైలట్‌గా ఎదిగే అరుదైన అవకాశం లభించింది. ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ సంయుక్తంగా 20 నెలల ఉచిత పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.

5 ఆగస్టు, 2026 12:15 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణ పేదింటి విద్యార్థినులకు ఫ్రీగా పైలట్ అయ్యే అవకాశం

Janavaani

ఆర్థిక ఇబ్బందుల కారణంగా పైలట్ కావాలనే కలను వదులుకోవాల్సి వస్తున్న తెలంగాణ విద్యార్థినులకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పేదింటి అమ్మాయిలకు ఉచిత కమర్షియల్ పైలట్ శిక్షణ అందించేందుకు మంగళవారం (ఆగస్టు 4న) ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. గివింగ్ గివింగ్ వింగ్స్ టూ ఫ్లై కార్యక్రమం కింద అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పైలట్ శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ మొత్తం 20 నెలల పాటు కొనసాగుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థినులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL)తో పాటు ఏటీఆర్ టైప్ రేటింగ్ కూడా అందించనున్నారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.

ఈ శిక్షణలో విద్యార్థినులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అన్ని ఖర్చులను ఇండిగోరీచ్, భారత్ కేర్ సంస్థలు భరిస్తాయి. శిక్షణ ఫీజుతో పాటు వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం, ఏటీఆర్ టైప్ రేటింగ్ వంటి అన్ని సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.

ఈ ఒప్పంద పత్రాలను ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, భారత్ కేర్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి పరస్పరం మార్చుకున్నారు. విమానయాన రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థినులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు దశలవారీగా శిక్షణ, మార్గదర్శకత్వం అందించి విజయవంతమైన పైలట్ కెరీర్‌కు అవసరమైన అన్ని విధాల సహకారం అందించనున్నట్లు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు