The Traitors Telugu | ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న పాపులర్ రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ గేమ్స్, వ్యూహాలు, ఊహించని ట్విస్టులతో సాగనున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు వెర్షన్‌కు యంగ్ అండ్ వర్సటైల్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా తేజ సజ్జా హోస్ట్‌గా కనిపించడంతో షోపై మరింత హైప్ క్రియేట్ అయింది. తాజాగా ‘ది ట్రైటర్స్’ తెలుగు వెర్షన్‌లో పాల్గొనే 20 మంది కంటెస్టెంట్స్ అధికారిక జాబితాను మేకర్స్ వెల్లడించారు. ఈ జాబితాలో సినీ, డిజిటల్, మ్యూజిక్, ఫ్యాషన్, బిజినెస్, సోషల్ మీడియా వంటి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. నటుడు, రచయిత హర్షవర్ధన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి, హాస్య నటి విద్యుల్లేఖ రామన్, కమెడియన్ విష్ణు ఓయ్, హీరో సాయి రోనాక్, సింగర్ చిన్మయి శ్రీపాద ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ, ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ కూడా ఈ షోలో తమదైన శైలిలో సందడి చేయనున్నారు.
డిజిటల్ మీడియా, యూట్యూబ్ రంగం నుంచి వర్ష డిసౌజా, మౌనీష చౌదరి (ఇషా వ్లోగ్స్), గౌరవ్ సునీల్, నిఖిల్ విజయేంద్ర సింహ పాల్గొననున్నారు. అలాగే అభినవ కవి, ర్యాపర్ ప్రణవ్ చాగంటి, గేమర్ పుప్పాల ధనంజయ్, కొరియోగ్రాఫర్ ఫల్గుణి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక బిజినెస్, ఇతర రంగాల నుంచి శ్రీదేవి చౌదరి, రాహత్ అచ్చంట, షోస్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, నటి ఆషికా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
విభిన్న నేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలు కలిగిన ఈ 20 మంది కంటెస్టెంట్స్ మధ్య జరిగే మైండ్ గేమ్స్, వ్యూహాలు, నమ్మకాలు, మోసాలు షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. వీరందరినీ తేజ సజ్జా తనదైన స్టైల్‌లో ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ‘ది ట్రైటర్స్’ తెలుగు వెర్షన్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.



















