చెన్నై, ఆగస్టు 15 (జనవాణి): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నటి త్రిష కనిపించడం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులు ఎస్‌ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ పక్కనే త్రిష కూర్చోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో విజయ్-త్రిషలపై గతంలో వచ్చిన రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.
విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష..
పసుపు రంగు చీరలో, మల్లెపూలతో వేడుకలకు వచ్చిన త్రిష.. ముందు వరుసలో కూర్చున్నారు. విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్‌ల పక్కనే ఆమెకు సీటు కేటాయించడంతో ఈ దృశ్యాలు ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి. విజయ్ పరేడ్‌కు సెల్యూట్ చేసిన సమయంలో త్రిష కూడా సెల్యూట్ చేశారు. వేడుకలకు త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి హాజరయ్యారు. అయితే.. విజయ్ తల్లిదండ్రులతో కలిసి ఆమె కనిపించిన తీరు అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
Loading Tweet...
గతంలోనూ ఇలాంటి సీన్లే..
విజయ్, త్రిషలపై రూమర్స్ రావడం ఇదే తొలిసారి కాదు. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడంతో పాటు.. కొన్ని సందర్భాల్లో కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.
విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ త్రిష ముందు వరుసలోనే కూర్చున్నారు. ఆ సమయంలో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్‌ను ఆమె ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.
రాజకీయాల్లోకి త్రిష వస్తుందా?
విజయ్ టీవీకే ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక త్రిష రాజకీయ ప్రవేశంపై ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె టీవీకేలో చేరి రాజకీయాల్లోకి వస్తారని, విజయ్ ఖాళీ చేసే స్థానంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటూ కొన్ని కథనాలు, సోషల్ మీడియా పోస్టులు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిపై టీవీకే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అంతేకాదు.. 2004లో ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూలో తాను భవిష్యత్తులో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు త్రిష సరదాగా చెప్పిన వీడియో కూడా ఈ ఏడాది వైరల్ అయింది. విజయ్ రాజకీయ ప్రస్థానం ఊపందుకున్న సమయంలో ఆ వీడియో బయటకు రావడంతో ఆమె రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మరింత పెరిగాయి.
అయితే రాజకీయ ప్రచారానికి త్రిష స్పష్టత ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనని, రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని ఆమె తరఫున న్యాయవాది ప్రకటన చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
విజయ్-త్రిషపై రూమర్స్.. మళ్లీ చర్చ
విజయ్, త్రిష చాలాకాలంగా స్నేహితులు, సహనటులుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారీ సోషల్ మీడియాలో వారి వ్యక్తిగత అనుబంధంపై ఊహాగానాలు రావడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష పాల్గొనడం, ఆయన తల్లిని ఆప్యాయంగా పలకరించడం కూడా అప్పట్లో విస్తృతంగా చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం కూడా కొంతకాలం వార్తల్లో నిలిచింది. త్రిష కారణంగానే వీరు విడిపోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆగస్టు 7న ఆమె ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో కేసు ముగిసింది. దీంతో కొంతకాలంగా సద్దుమణిగిన విజయ్-త్రిష చుట్టూ ఉన్న ఆన్‌లైన్ ఊహాగానాలు.. తాజాగా స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష విజయ్ తల్లిదండ్రుల పక్కన కనిపించడంతో మళ్లీ వైరల్ అవుతున్నాయి.





















