నేపాల్ వ‌ర‌ద‌ల్లో 140 మంది తెలుగు యాత్రికులు గ‌ల్లంతు..!

నేపాల్‌లో భోటేకోశీ నదికి ఆకస్మికంగా భారీ వరదలు రావడంతో హైదరాబాద్‌ నుంచి పర్యటనకు వెళ్లిన 156 మంది తెలుగు యాత్రికుల బృందంలో 140 మంది ఆచూకీ తెలియకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మరో 16 మంది అనారోగ్య కారణాలతో హోటల్‌లోనే ఉండిపోవడంతో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం కుటుంబసభ్యులు అధికారులను, టూర్ ఏజెన్సీని సంప్రదిస్తున్నారు.

27 ఆగస్టు, 2026 1:21 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నేపాల్ వ‌ర‌ద‌ల్లో 140 మంది తెలుగు యాత్రికులు గ‌ల్లంతు..!

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు టూర్ ఏజెన్సీ ద్వారా నేపాల్‌ పర్యటనకు వెళ్లిన 156 మంది తెలుగు యాత్రికుల్లో 140 మంది ఆచూకీ తెలియడం లేదు. యాత్రికుల బృందం నేపాల్‌లోని ఓ హోటల్‌లో బస చేసింది. వీరిలో 140 మంది బుధవారం స్థల సందర్శన కోసం హోటల్‌ నుంచి బయటకు వెళ్లారు. మరో 16 మంది అనారోగ్య కారణాలతో హోటల్‌ గదులకే పరిమితమయ్యారు. అదే సమయంలో భోటేకోశీ నదికి అకస్మాత్తుగా భారీ వరదలు రావడంతో బయటకు వెళ్లిన వారితో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం.

గల్లంతైన వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తుండటంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమవారి ఆచూకీ కోసం టూర్‌ ఏజెన్సీతో పాటు అధికారులను సంప్రదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. హోటల్‌లోనే ఉండిపోయిన 16 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందినవారిగా గుర్తించారు. నేపాల్‌లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 95 మంది మృతి చెందినట్లు, వందలాది మంది గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో గల్లంతైన 140 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా గుర్తించి, వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాలను కోరుతున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు