హిమాలయాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌పై నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే నేపాల్‌లో సంభవించిన భారీ ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కు ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా తెలిపారు. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీల మేర పెరిగాయని వెల్లడించారు.

2 సెప్టెంబర్, 2026 1:03 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హిమాలయాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌పై నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Social Media Image

Nepal Flash Floods | సెప్టెంబర్ 02 (జనవాణి): నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన ఈ విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, ప్రస్తుతం సుమారు 1.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపారు.

లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద గ్లేసియర్ విరిగిపడటంతో ఈ ప్రమాదకర ఫ్లాష్‌ ఫ్లడ్స్ సంభవించినట్లు సమాచారం. హిమాలయాల్లో వాతావరణ మార్పుల కారణంగా ముప్పు ఏ స్థాయిలో పెరుగుతోందో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోందని బాలేంద్ర షా పేర్కొన్నారు. వాతావరణ మార్పు ఒక్క దేశానికి సంబంధించిన సమస్య కాదని.. ప్రపంచ దేశాల ఉమ్మడి చర్యల ఫలితమేనని ఆయన అన్నారు. అందువల్ల వాతావరణ విపత్తుల వల్ల తలెత్తే సమస్యలను ఎదుర్కోవడం కూడా ప్రపంచ దేశాల సమష్టి బాధ్యత అని తెలిపారు.

1,127కు చేరిన మృతుల సంఖ్య

నేపాల్-టిబెట్ ప్రాంతాలను అతలాకుతలం చేసిన ఫ్లాష్‌ ఫ్లడ్స్‌లో మృతుల సంఖ్య బుధవారం నాటికి 1,127కు చేరింది. నేపాల్ పోలీసుల వివరాల ప్రకారం చిత్వాన్‌లో 348, తూర్పు నావల్‌పరాసిలో 217, పశ్చిమ నావల్‌పరాసిలో 190, నువాకోట్‌లో 155, గోర్ఖాలో 66, ధాడింగ్‌లో 59, రసువాలో 45, తనాహులో 38 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. ఇప్పటివరకు 1,127 మృతదేహాలకు పోస్టుమార్టం, చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ పూర్తైంది. వీటిలో 95 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 6,541 మందిని భద్రతా దళాలు రక్షించాయి. ఇంకా 4,800 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.

Photo Credit: AFP

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు