సూడాన్‌లో బంగారు గని కూలి 60 మంది మృతి

సూడాన్‌లో ఘోర గని ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కొర్దోఫ్యాన్ ప్రాంతంలోని అల్‌-జరా బంగారు గని సొరంగాలు ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 60 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలకు భారీ యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

16 సెప్టెంబర్, 2026 6:37 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సూడాన్‌లో బంగారు గని కూలి 60 మంది మృతి

Representative image from a gold mine in Sudan. (Reuters)

సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కొర్దోఫ్యాన్ ప్రాంతంలోని ఓ బంగారు గని సొరంగాలు ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఎల్‌-నుహుద్‌ పట్టణానికి సమీపంలోని అల్‌-జరా బంగారు గనిలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. సొరంగాలు కూలిన వెంటనే తోటి కార్మికులు సహాయక చర్యలు ప్రారంభించారు. రాత్రంతా సాధారణ పనిముట్లతో శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలు, ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలించారు. బుధవారం ఉదయానికి సుమారు 60 మృతదేహాలను వెలికితీసినట్లు కార్మికులు తెలిపారు. అయితే గని లోపల భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదించాయి. శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలు అవసరమని ప్రమాదం నుంచి బయటపడిన కార్మికుడు ఖైర్‌ అల్‌ సయ్యద్‌ జబారా తెలిపారు. ఇంకా ఎంతమంది లోపల చిక్కుకున్నారో స్పష్టత లేదని చెప్పారు. మరో కార్మికుడు అల్‌-అమీన్‌ సులేమాన్‌ మాట్లాడుతూ గనిలోని సొరంగాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ఒక సొరంగం కూలితే పక్కనున్న సొరంగాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉండటంతో వరుసగా సొరంగాలు కూలినట్లు వివరించారు.

యుద్ధంతో పెరిగిన బంగారం తవ్వకాలు

సూడాన్‌లో 2023 ఏప్రిల్‌లో సైన్యం, పారామిలటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (RSF) మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ పోరాటం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో అనేక మంది ప్రజలు జీవనోపాధి కోసం బంగారం తవ్వకాలపై ఆధారపడుతున్నారు. ప్రమాదకరమని తెలిసినా, కొందరు అధికారిక అనుమతులు లేని ప్రాంతాల్లోనూ బంగారం కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆహార కొరత, ఉపాధి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ గని ప్రమాదం మరో విషాదాన్ని మిగిల్చింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు