సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన విమాన ప్రమాదం.. 20 నిమిషాలు గాల్లోనే చక్కర్లు

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు క్లియరెన్స్ దొరకలేదు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.

30 జులై, 2026 11:18 AM•ByRamchandram

Share this article

సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన విమాన ప్రమాదం.. 20 నిమిషాలు గాల్లోనే చక్కర్లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Photo: Telangana CMO)

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానానికి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో దాదాపు 20 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం 6.15 గంటలకు ఇండిగో 6E717 విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. శంషాబాద్ విమానాశ్రయానికి సుమారు రాత్రి 8.15 గంటలకు చేరుకుంది. అయితే ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఏటీసీ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో దాదాపు 23 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు విమానంలో ఉన్న 200 మంది ప్రయాణికులు ఆందోళన చెందారు. చివరకు వాతావరణం అనుకూలించడంతో క్లియరెన్స్ దొరికి రాత్రి 8.53 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

▶CategoriesNews and Telangana
▶Follow us onFacebook, Twitter & Instagram.
R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు