ఆగస్టు 8, 2026 రాశిఫలాలు: వృషభ రాశిలోని రోహిణి నక్షత్రంలో చంద్రుడి సంచారం ప్రభావంతో ఈ రోజు భావోద్వేగ స్థిరత్వం, సృజనాత్మకత, ఆర్థిక విషయాల్లో అనుకూలత పెరగనుంది. కొత్త పనులు ప్రారంభించడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని రాశులకు మంచి సమయం. అయితే మేషం, మిథునం, వృశ్చిక రాశుల వారు మాట విషయంలో సంయమనం పాటించడం మంచిది. మరి మిగిలిన రాశుల వారికి ఈ రోజు ఎలా ఉందో చూద్దాం.
మేష రాశి
ఈ రోజు ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అయితే చిరాకు, తొందరపాటు వల్ల సోదరులు లేదా ఇరుగుపొరుగు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. పెట్టుబడులు, పాత బకాయిల పరిష్కారానికి రోజు అనుకూలంగా ఉన్నా.. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు.
పరిహారం: ఆలయంలో పాలు లేదా తెల్లని స్వీట్లు సమర్పించండి.
వృషభ రాశి
చంద్రుడి సంచారం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిత్వంలో ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు. ప్రేమ, కుటుంబ సంబంధాల్లో సంతృప్తి ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడినా పెద్ద పెట్టుబడులు, ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
పరిహారం: ఉదయం నుదుటిపై తెల్లచందనం తిలకం ధరించండి.
మిథున రాశి
ఈ రోజు మీ ఆలోచనా శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మేధోపరమైన పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే కోపం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. ప్రేమ, కుటుంబ విషయాల్లో మాటలను అదుపులో ఉంచాలి. ఆర్థిక విషయాల్లో వెంటనే లాభాలు ఆశించకుండా ఖర్చులు, పెట్టుబడుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం.
పరిహారం: అవసరమైన వారికి తెల్ల బియ్యం లేదా పాలు దానం చేయండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం, మేధోశక్తి పెరుగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు అనుకూలమైన రోజు. అయితే భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికంగా స్పష్టత పెరుగుతుంది. పాత బకాయిలు లేదా పెట్టుబడుల నుంచి ప్రయోజనం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో నాయకత్వ అవకాశాలు రావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాస్తవాలను పరిశీలించిన తర్వాతే తీసుకోవాలి.
పరిహారం: ఓం సోం సోమాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి.
సింహ రాశి
ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనసులో ప్రశాంతత ఉంటుంది. ప్రేమ, కుటుంబ విషయాల్లో నిజాయితీకి ప్రాధాన్యం ఇవ్వండి. ఆర్థికంగా మంచి అవకాశాలు వచ్చినా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. గతంలో చేసిన కృషికి తగిన ఫలితం లభిస్తుంది. స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో పనులు ముందుకు సాగుతాయి.
పరిహారం: రాగి పాత్రలో నీరు తీసుకుని కొద్దిగా ఎర్రచందనం లేదా కుంకుమ కలిపి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి.
కన్య రాశి
కొత్త పని ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, పరిచయస్తులు, పెద్దలు, సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. అయితే మీ రూపురేఖలు, వ్యక్తిత్వం గురించి అనవసరంగా ఆలోచించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో సీనియర్ల సహాయంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి.
పరిహారం: ఆలయం లేదా ధార్మిక ప్రదేశంలో 625 గ్రాముల శనగపప్పు దానం చేయండి.
తుల రాశి
సామాజికంగా గౌరవం, ప్రతిష్ఠ పెరిగే అవకాశం ఉంది. పెద్దల నుంచి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ప్రేమ, కుటుంబ సంబంధాల్లో అనుబంధం బలపడుతుంది. అయితే వ్యక్తిగత విషయాల్లో అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో సహచరులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చినా నిరాశ చెందకండి.
పరిహారం: హనుమాన్ చాలీసా చదవండి లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని 21 సార్లు జపించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు మీ ప్రయత్నాలకు మంచి సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. అయితే మాట పట్టింపులు, వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, లాభాలు కొంత ఆలస్యంగా రావచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు, రహస్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
పరిహారం: వెండి నాణెం దగ్గర ఉంచుకోండి లేదా ఆలయంలో తెల్లని పూలు సమర్పించండి.
ధనుస్సు రాశి
ఈ రోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు, ప్రేమ లేదా సృజనాత్మక పనులకు సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ఫలితాలు కొంత ఆలస్యంగా రావచ్చు. తొందరపాటు, ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత, రహస్య విషయాలను ఇతరులతో పంచుకోకండి.
పరిహారం: పసుపు రంగు దుస్తులు ధరించి గురువును పూజించండి. ఆవులకు లేదా ఇతర జంతువులకు ఆహారం పెట్టండి.
మకర రాశి
జీవిత భాగస్వామితో సంభాషణలు సానుకూలంగా సాగుతాయి. కుటుంబంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అయితే పాత సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సోదరులు లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచాలి. ఆర్థికంగా సాధారణ పరిస్థితులు ఉంటాయి. పెద్దల సలహాతో పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులు ప్రస్తుతం చేస్తున్న పనులను మరింత బలోపేతం చేసుకోవాలి.
పరిహారం: శని ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు దానం చేయండి.
కుంభ రాశి
ఈ రోజు ఆరోగ్యం, శక్తిలో మెరుగుదల కనిపిస్తుంది. సోదరులతో సంబంధాలు లేదా చిన్న ప్రయాణం ఆనందాన్ని కలిగించవచ్చు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అయితే డబ్బు విషయంలో తొందరపాటు వద్దు. ఖర్చులు, ఆదాయాన్ని సమతుల్యం చేసుకోవాలి. ఉద్యోగంలో సీనియర్ల సలహా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన ఫలితాలు ఆలస్యంగా వచ్చినా ఓపికగా ముందుకు సాగండి.
పరిహారం: ఉదయం రావి లేదా మర్రి చెట్టుకు నీరు పోసి నల్ల నువ్వులు దానం చేయండి.
మీన రాశి
ఈ రోజు సంబంధాల్లో ప్రశాంతత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, సంభాషణల్లో మృదుత్వం పాటించాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. సృజనాత్మక పనుల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి.
పరిహారం: గాయత్రీ మంత్రాన్ని జపించండి లేదా అవసరమైన వారికి ఆకుకూరలు దానం చేయండి.
ఈ రోజు సాధారణ సూచనలు
రోహిణి నక్షత్రంలో చంద్రుడి సంచారం కారణంగా స్థిరత్వం, సృజనాత్మకత, భావోద్వేగ సమతుల్యతకు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించేవారు, కీలక నిర్ణయాలు తీసుకునేవారు పరిస్థితులను పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్లడం మంచిది. మాటల విషయంలో సంయమనం, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.





















