డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్‌ కారులో మంటలు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. చింతపల్లి వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పవర్ బ్యాంక్ పేలడంతో కారు కేబిన్‌లో మంటలు వ్యాపించినట్లు సమాచారం.

17 సెప్టెంబర్, 2026 11:21 AM•ByNarender Kumar Nangunoori

Share this article

డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్‌ కారులో మంటలు

మహబూబాబాద్, సెప్టెంబర్ 17 (జనవాణి): డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గురువారం చింతపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పవర్ బ్యాంక్ పేలడంతో కారు కేబిన్‌లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మార్గమధ్యంలోని చింతపల్లి వద్దకు చేరుకోగానే కారులో మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన ఎమ్మెల్యే, ఆయన సిబ్బంది వెంటనే కారులో నుంచి బయటకు దిగారు. దీంతో ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ఘటనలో ఆయన డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

కారు దగ్ధమైన అనంతరం రాంచంద్ర నాయక్ మరో వాహనంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైందన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు, నియోజకవర్గ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నారని తెలియడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు