అక్కెరకు రానోడు అట్టుకు జుట్టు పీక్కున్నట్టు ఉంది.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఏనుగుల రాకేశ్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. అక్కెరకు రానోడు అట్టుకు జుట్టు పీక్కున్నట్టు ఉంది ఈ నోటిఫికేషన్ అని ఎద్దేవా చేశారు.

29 జులై, 2026 9:32 PM•ByRamchandram

Share this article

అక్కెరకు రానోడు అట్టుకు జుట్టు పీక్కున్నట్టు ఉంది.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఏనుగుల రాకేశ్ రెడ్డి సెటైర్లు

ఏనుగుల రాకేశ్ రెడ్డి (File Photo)

తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. అక్కెరకు రానోడు అట్టుకు జుట్టు పీక్కున్నట్టు ఉంది ఈ నోటిఫికేషన్ అని ఎద్దేవా చేశారు. స్వయంగా డీజీపీ గారే 19 వేల ఖాళీలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం పంతానికి పోవడం దుర్మార్గమని అన్నారు.

ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది కాలంగా పోలీస్ అభ్యర్థులు చేస్తున్న ఉద్యమాలను చిన్నచూపు చూడటం దుర్మార్గమని ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువత ఆకాంక్షలను తుంగలో తొక్కేలా కేవలం 7,437 ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమని అన్నారు. ఈ నోటిఫికేషన్ వల్ల కొన్ని జిల్లాల్లో కొన్ని రిజర్వేషన్ వర్గాల వారికైతే కనీసం ఒక్క పోస్టు కూడా వచ్చే అవకాశం ఉండదని.. ఇది అత్యంత దుర్మార్గమని విమర్శించారు. వయసు మీరి పోయి గత రెండేళ్లుగా నోటిఫికేషన్ లేకపోవడంతో ఈ నోటిఫికేషన్ మీదనే ఆశలు పెట్టుకున్న వేలాదిమంది విద్యార్థులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు.

స్వయంగా అభ్యర్థులతో కలిసి డీజీపీని కలిసినా, ప్రభుత్వానికి నిరుద్యోగుల గోడు వినిపించట్లేదని ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజల గోడు పట్టదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో మూడు భారీ నోటిఫికేషన్ల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగానికి భరోసా ఇస్తే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం కేవలం 7,000 ఉద్యోగాలతో చేతులు దులుపుకోవడం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడడం కాదా అని మండిపడ్డారు. ఈ నోటిఫికేషన్ నిలిపివేసి మరో 13 వేల పోస్టులు కలిపి మొత్తం 20 వేల పోస్టులకు ఆగస్టు 15 లోపు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే, పోలీస్ అభ్యర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా 20 వేల జంబో పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు