ఎర్రవల్లిలో భూముల రీసర్వేకు బ్రేక్.. అడ్డుకున్న వెంకటాపూర్ గ్రామస్థులు

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ఉద్రిక్తతకు దారితీసింది. తమ గ్రామానికి చెందిన 113 ఎకరాల భూమిని ఎర్రవల్లి గ్రామ రికార్డుల్లో నమోదు చేశారని ఆరోపిస్తూ శివారు వెంకటాపూర్ గ్రామస్థులు రెవెన్యూ అధికారుల ఎంజాయ్‌మెంట్ సర్వేను అడ్డుకున్నారు. ముందుగా తమ భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని డిమాండ్ చేశారు.

23 సెప్టెంబర్, 2026 6:56 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఎర్రవల్లిలో భూముల రీసర్వేకు బ్రేక్.. అడ్డుకున్న వెంకటాపూర్ గ్రామస్థులు

సిద్దిపేట,సెప్టెంబర్ 23 (జనవాణి): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో భూముల రీసర్వేకు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వేలో భాగంగా రెవెన్యూ అధికారులు ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహిస్తుండగా శివారు వెంకటాపూర్ గ్రామస్థులు దాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామానికి సంబంధించిన 113 ఎకరాల భూమిని ఎర్రవల్లి గ్రామ రికార్డుల్లో నమోదు చేశారని వెంకటాపూర్ గ్రామస్థులు ఆరోపించారు. ఈ భూమి విషయంలో ముందుగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, హద్దులను స్పష్టంగా నిర్ధారించిన తర్వాతే ఇతర భూముల సర్వే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఈ విషయంపై గ్రామస్థులు మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. అనంతరం బుధవారం కలెక్టరేట్‌కు వెళ్లి అడిషనల్ కలెక్టర్లను కలిసి తమ గ్రామానికి సంబంధించిన భూమిని కాపాడాలని కోరారు. అలాగే మర్కూక్ తహశీల్దార్ సరితను కలిసి వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్ 325లో ఉన్న 113 ఎకరాల భూమిపై ముందుగా స్పష్టత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో హద్దులను నిర్ధారించిన అనంతరం రీసర్వే ప్రక్రియను కొనసాగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు