Gas eKYC Last Date: గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు.. ఏజెన్సీల వద్ద వినియోగదారుల క్యూ

గ్యాస్‌ వినియోగదారులకు కీలక అలర్ట్‌. ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో గ్యాస్‌ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. గడువు పొడిగిస్తారా? లేదా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది.

15 ఆగస్టు, 2026 1:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Gas eKYC Last Date: గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు.. ఏజెన్సీల వద్ద వినియోగదారుల క్యూ

Social Media Image

గ్యాస్‌ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ (eKYC) పూర్తి చేసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈకేవైసీ చేసుకునేందుకు ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉన్నట్లు చెబుతున్నారు. పలు గ్యాస్‌ కంపెనీల ఏజెన్సీలు వినియోగదారులకు ఫోన్‌లు, మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తూ.. వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాయి.

ఈకేవైసీ చేయకపోతే గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని, సబ్సిడీకి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ కోసం వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, ఆదివారం సెలవు కావడంతో ఈకేవైసీ గడువుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే శని, ఆదివారాల్లోనూ ఏజెన్సీలు పనిచేసే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. గడువు విషయంలో స్పష్టత వచ్చే వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా సమీపంలోని గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు