భద్రాచలం వద్ద గోదావరి నది క్రమంగా శాంతిస్తోంది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గడంతో వరద ఉధృతి తగ్గుతోంది. 56.10 అడుగుల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు 48.7 అడుగులకు గోదావరి నీటిమట్టం తగ్గింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఇక ఆదివారం ఉదయం నీటిమట్టం 47.8కి చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు.
ప్రస్తుతం భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్కుల నీటితో గోదావరి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం తగ్గడంతో చర్ల-వెంకటాపురం, విజయవాడ-జగదల్‌పూర్ ప్రధాన రహదారులపై రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. ఇదిలా ఉంటే దుమ్మగూడెం, చర్ల మండలాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు వరదల కారణంగా నీటమునిగాయి.





















