గీత దాటితే వేటు తప్పదు.. ప్రభుత్వ పనితీరులో మార్పులు రావాలి..పెన్షన్ రూ.4,000 చేయాలి: గుత్తా సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీలోని అంతర్గత పరిణామాలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గీత దాటిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం, కేబినెట్ పనితీరులో మార్పులు అవసరమని సూచించారు. రాష్ట్రంలో పెన్షన్‌ను రూ.4,000కు పెంచడంతో పాటు రైతు భరోసాను కొనసాగించాలని కోరారు.

29 ఆగస్టు, 2026 3:24 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గీత దాటితే వేటు తప్పదు.. ప్రభుత్వ పనితీరులో మార్పులు రావాలి..పెన్షన్ రూ.4,000 చేయాలి: గుత్తా సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఆగస్టు 29 (జనవాణి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు, పార్టీ అంతర్గత పరిస్థితులపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో పాటు కేబినెట్ పనితీరులోనూ అవసరమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

గీత దాటిన వారిపై చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. చిన్నా రెడ్డి కి మంచి అవకాశం ఇచ్చింది. పార్టీ పట్ల చిన్నారెడ్డి మాట్లాడటం తప్పు. అంతర్గత మాట్లాడి ఉంటే బాగుండేది. పార్టీలో కొనసాగుతున్న గ్రూపు తగాదాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కొండా సురేఖ అంశంలో చర్యలు తీసుకుంటేనే బెటర్. కొండా ఫ్యామిలీపై చర్యలకు రెండు ఆప్షన్‌లు ఉంటాయి. వేటు వేయడం, పునర్వ్యవస్థీకరణ రెండు అవకాశాలు ఉన్నాయి. క్యాడర్‌లో ఉన్న అసంతృప్తిని సమర్థంగా పరిష్కరించి, పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ప్రభుత్వం, కేబినెట్‌లో మార్పులు అవసరం

అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని గుత్తా పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో వేగం, సమన్వయం పెరగాలని, ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు మంత్రివర్గ పనితీరులోనూ అవసరమైన మార్పులు రావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రివ‌ర్గ పున‌వ‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ చేప‌డితే అసంతృప్తి నేత‌ల‌కు చెక్ పెట్టిన‌ట్ల‌వుతుంద‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో సో మేని విండోస్ ఉంటాయని.. ఎవరు ఏ విండోతో ఉంటారో తెలీదన్నారు. కేబినెట్‌లో లంబాడా, యాద‌వ్‌, మున్నూరుకాపుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌న్నారు. ఈమేర‌కు శ‌నివారం ఆయ‌న మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా పై వ్యాఖ్య‌లు చేశారు.

పెన్షన్ రూ.4,000కు పెంచాలి

రాష్ట్రంలోని సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4,000కు పెంచాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అలాగే రైతులకు అందుతున్న రైతు భరోసా పథకాన్ని కొనసాగించాలని కోరారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పార్టీ పరంగా ఇంకా చేయాల్సింది చాలా ఉందని పేర్కొంటూ పాలనలో వేగం, పార్టీ వ్యవహారాల్లో క్రమశిక్షణ, అంతర్గత సమన్వయంపై ఆయన చేసిన సూచనలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు