హైదరాబాద్‌లో 24 గంటల పాటు వాటర్‌ కట్‌.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

హైదరాబాద్‌ నగరవాసులకు జలమండలి కీలక ప్రకటన చేసింది. బండ్లగూడ ఎక్స్‌ రోడ్‌ వద్ద పైప్‌లైన్‌ జంక్షన్‌ పనుల కారణంగా ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పూర్తిగా లేదా పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

28 ఆగస్టు, 2026 5:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌లో 24 గంటల పాటు వాటర్‌ కట్‌.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

హైదరాబాద్, ఆగస్టు 28 (జనవాణి): హైదరాబాద్‌ నగరవాసులకు బిగ్‌ అలర్ట్‌. నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. బండ్లగూడ ఎక్స్‌ రోడ్‌ వద్ద చేపట్టనున్న పైప్‌లైన్‌ జంక్షన్‌ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (HMWSSB) తెలిపింది.

బండ్లగూడ ఎక్స్‌ రోడ్‌ వద్ద జీహెచ్‌ఎంసీ బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులు చేపడుతోంది. ఈ పనులకు అనుకూలంగా హైదరాబాద్‌ నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్ట్‌ ఫేజ్‌-3, రింగ్‌ మెయిన్‌-1కు చెందిన 1500 ఎంఎం వ్యాసం కలిగిన ఎంఎస్‌ గ్రావిటీ మెయిన్‌పై జంక్షన్‌ పనులు చేపట్టనున్నారు. ఈ పనుల నేపథ్యంలో ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు వచ్చే అవకాశం ఉందని జలమండలి అధికారులు వెల్లడించారు.

ప్రభావిత ప్రాంతాలు

శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్‌, మధుబన్‌, దుర్గానగర్‌, సులేమాన్‌ నగర్‌, పీడీపీ, గోల్డెన్‌ హైట్స్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, 9 నంబర్‌, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రసన్ననగర్‌, జూబ్లీహిల్స్‌, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్‌, షేక్‌పేట్‌ రిజర్వాయర్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

నీటి సరఫరాకు అంతరాయం ఉండే ప్రాంతాల ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి అధికారులు సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు