జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: హనుమకొండలో ‘ఇండియా’ కూటమి ఆందోళన

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ఆందోళన నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర చేపట్టిన కూటమి నేతలు.. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

5 అక్టోబర్, 2026 7:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: హనుమకొండలో ‘ఇండియా’ కూటమి ఆందోళన

హనుమకొండ,అక్టోబర్ 5 జనవాణి): ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు.

డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు పాటు ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Rali

ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, అయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శించారు. దేశంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు జరగాలంటే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు.

Nirasana

▶CategoriesNews and Telangana
▶Follow us onFacebook, Twitter & Instagram.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు