బస్ ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కుప్పకూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా హెలికాప్టర్ గాల్లో అదుపుతప్పి పార్కింగ్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

16 సెప్టెంబర్, 2026 1:06 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బస్ ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కుప్పకూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి

Social Media Image

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా హెలికాప్టర్ గాల్లో అదుపుతప్పి కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

చాట్స్‌వర్త్ ప్రాంతంలో ఓ ప్రయాణికుల బస్సు, ఎస్‌యూవీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదాన్ని కవర్ చేసేందుకు పలు న్యూస్ మీడియా సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గగనతలం నుంచి ప్రమాద దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఎన్‌బీసీ లాస్ ఏంజెలెస్‌కు చెందిన న్యూస్ హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పింది.

హెలికాప్టర్ వేగంగా కిందకు దూసుకొచ్చి సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం అనంతరం అక్కడ భారీగా మంటలు చెలరేగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. పార్కింగ్‌లో ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు లాస్ ఏంజెలెస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. మృతుల్లో హెలికాప్టర్‌లో ఉన్న వ్యక్తులతో పాటు పార్కింగ్ ప్రాంతంలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హెలికాప్టర్ ఎలా అదుపుతప్పింది? సాంకేతిక లోపమా, లేక ఇతర కారణాలా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు