మల్లారెడ్డి కోడలు బర్త్‌డే ఫ్లెక్సీలు చించివేత..సొంత పార్టీలోనే బిగ్ షాక్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కుటుంబంలో జరిగిన బర్త్‌డే వేడుకకు సంబంధించిన ఫ్లెక్సీలు ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్‌లో రగడ నెలకొన్నట్లు సమాచారం.

17 సెప్టెంబర్, 2026 3:11 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మల్లారెడ్డి కోడలు బర్త్‌డే ఫ్లెక్సీలు చించివేత..సొంత పార్టీలోనే బిగ్ షాక్

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనవాణి): మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన పుట్టినరోజు ఫ్లెక్సీల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఐడీపీఎల్, సుచిత్ర ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి కేంద్రంగా మారాయి. ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫొటోలు లేకపోవడంపై స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కేవలం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రాలనే ఫ్లెక్సీల్లో ముద్రించడాన్ని కొందరు కార్యకర్తలు తప్పుబట్టారు. పార్టీ నాయకత్వాన్ని విస్మరిస్తున్నారంటూ ఆరోపిస్తూ పలుచోట్ల ఫ్లెక్సీలను చించివేసి నిరసన తెలిపారు. మల్లారెడ్డి కుటుంబం పార్టీ క్రమశిక్షణను పాటించాలని, ఇదే తరహా పరిణామాలు పునరావృతమైతే తీవ్రంగా స్పందిస్తామని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరించారు.

అయితే, ఈ వ్యవహారంపై ప్రీతిరెడ్డి అభిమానులు, మద్దతుదారులు మరో వాదన వినిపిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీలను పార్టీ రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని వారు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో మల్లారెడ్డి వర్గానికి, స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజా ఫ్లెక్సీల వివాదంతో మరోసారి తెరపైకి వచ్చినట్టైంది. మరి ఈ ఫ్లెక్సీల వివాదం బీఆర్ఎస్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు