పుణ్యం తగ్గి పాపం పెరుగుతోంది..బోనాల భవిష్యవాణిలో మాతంగి అనురాధ హెచ్చరిక

హైదరాబాద్ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. సమాజంలో పుణ్యం తగ్గి పాపం పెరుగుతోందని, ప్రజలు ఆచారాలు, సంప్రదాయాలను విస్మరిస్తే కుండపోత వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

10 ఆగస్టు, 2026 4:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పుణ్యం తగ్గి పాపం పెరుగుతోంది..బోనాల భవిష్యవాణిలో మాతంగి అనురాధ హెచ్చరిక

AI Image

హైదరాబాద్, ఆగస్టు 10 (జనవాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఉప్పుగూడ మహాంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి సమాజంలో ఆచార వ్యవహారాలను వీడితే తీవ్ర అనర్థాలు తప్పవు అని అనురాధ హెచ్చరించారు. అమ్మవారిని ఆవాహనం చేసుకుని పచ్చికుండపై నిలుచున్న మాతంగి అనురాధ.. వర్షాలు, పంటలు, ప్రజల క్షేమం తదితర అంశాలపై భవిష్యవాణి చెప్పారు. సమాజంలో ఆచార వ్యవహారాలను వీడితే తీవ్ర అనర్థాలు తప్పవు అని హెచ్చరించారు.

పాపం పెరిగితే కుండపోత వర్షాలు

సమాజంలో పుణ్యం తగ్గిపోయి పాపం పెరిగిపోతోందని మాతంగి అనురాధ అన్నారు. ప్రజలు తమ ఆచారాలు, సంప్రదాయాలను విస్మరిస్తే తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. పాపాలు ఎక్కువైతే కుండపోత వర్షాలు వచ్చి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. వరదలు వస్తే ఎక్కడ మునిగిపోతారో, ఎక్కడ తేలుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

పెద్దలను గౌరవించాలి

పెద్దలు.. పిల్లలు ఆచారాలు.. సంప్రదాయాలు పాటించాలని తెలిపారు. లేకపోతే వరదలు వచ్చి అందరూ మునిగిపోతారని మాతంగి అనూరాధ భవిష్యవాణి చెప్పారు. ఎక్కడ మునిగి పోతారో.. ఎక్కడ తేలుతారో కూడా తెలియదు అని చెప్పారు. ప్రస్తుత కాలంలో పిల్లలు చేస్తున్న అనర్థాలను తల్లిదండ్రులే అడ్డుకోవాలని సూచించారు. ఆచారాలను విస్మరిస్తే అనర్థాలు జరుగుతాయని, అందువల్ల కుటుంబ వ్యవస్థను, సంప్రదాయాలను గౌరవించాలని పిలుపునిచ్చారు.

భక్తి పేరుతో మూఢనమ్మకాలపై వ్యాఖ్యలు

ప్రజలు భక్తి మార్గం అనుకుని కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకాల వెంట వెళ్తున్నారని మాతంగి అనురాధ అన్నారు. తన పేరుతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ తనను బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసిన వారిని శిక్షిస్తానని, అయితే వారు తన పిల్లలేనని భావించి కాపాడుకుంటూ వస్తున్నానని పేర్కొన్నారు.

పెద్దలు.. పిల్లలు ఆచారాలు.. సంప్రదాయాలు పాటించాలని తెలిపారు. లేకపోతే వరదలు వచ్చి అందరూ మునిగిపోతారని మాతంగి అనూరాధ భవిష్యవాణి చెప్పారు. ఎక్కడ మునిగి పోతారో.. ఎక్కడ తేలుతారో కూడా తెలియదు బాలక అని చెప్పారు.

భక్తులను అమ్మవారు చల్లగా చూడాలి

భక్తులు తనను ఎంత భక్తిశ్రద్ధలతో కొలిస్తే అంత ఆనందంగా ఉంటానని మాతంగి అనురాధ భవిష్యవాణిలో పేర్కొన్నారు. భక్తుల కోరికలను నెరవేర్చి ప్రజలను చల్లగా చూస్తానని అమ్మవారి అభయంగా చెప్పారు. బండారు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని, మిమ్మలను కాపాడుతానని పేర్కొన్నారు.

బోనాల్లో కొనసాగుతున్న రంగం కార్యక్రమం

తెలంగాణలో బోనాల ఉత్సవాల్లో రంగం (భవిష్యవాణి) కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పూజల అనంతరం మాతంగి రంగంపైకి వచ్చి ప్రజల భవిష్యత్తు, వర్షాలు, పంటలు, రాష్ట్ర క్షేమం తదితర అంశాలపై భవిష్యవాణి వినిపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు