బీఆర్ఎస్ నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం అర్ధరాత్రి 12.50గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
ఈ నెల 26వ తేదీన ఉదయం హనుమకొండలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో రోహిణీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కార్డియక్ అరెస్ట్‌గా గుర్తించారు. దాదాపు తొమ్మిది సార్లు సీపీఆర్ చేసి, కష్టపడి ఆయన గుండెకు లయ తెప్పించారు. అప్పటికీ అపస్మారక స్థితిలోనే ఉండటంతో పెద్దిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ స్పహ లేకపోవడంతో పాటు, నాడీ సంబంధిత స్పందన కనిపించలేదని వైద్యుల తెలిపారు. కాగా, గుండె ఆగిన సమయంలో ఆక్సిజన్ మెదడుకు అందకపోవడంతో తీవ్ర నష్టం జరిగినట్లుగా ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీడీసీ పరీక్షల్లో కనిపంచాయని తెలిపారు. కాగా ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడిన పెద్ది.. గురువారం రాత్రి తుది శ్వాస విడచారు.





















