హైడ్రాకు పెరుగుతున్న మద్దతు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని జిల్లాల స్పీక్ ప్రతినిధుల డిమాండ్‌

హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న హైడ్రాకు వివిధ జిల్లాల నుంచి మద్దతు పెరుగుతోంది. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని జిల్లాల ప్రతినిధులు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను కోరారు.

12 ఆగస్టు, 2026 7:51 PM•ByRalin

Share this article

హైడ్రాకు పెరుగుతున్న మద్దతు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని జిల్లాల స్పీక్ ప్రతినిధుల డిమాండ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనవాణి): హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూములు, వరద కాలువల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో చెరువులు, కుంటలు, కాలువలు, పార్కులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని వారు కోరారు.

నిజామాబాద్‌, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన సొసైటీ ఫర్‌ పీపుల్స్‌ ఎంపవర్‌మెంట్‌ విత్‌ యాక్షనబుల్‌ నాలెడ్జ్‌ (SPEAK) ప్రతినిధులు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా తరహా వ్యవస్థ రెండు దశాబ్దాల క్రితమే ఏర్పడి ఉంటే నగరంలోని గొలుసుకట్టు చెరువుల్లో చాలా వరకు కాపాడుకునే అవకాశం ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో చెరువులు మాయమైన పరిస్థితి ఇతర జిల్లాల్లోనూ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హైడ్రా తరహా వ్యవస్థ అందుబాటులోకి వస్తే అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట పడటంతో పాటు ప్రజా ఆస్తులను కబ్జా చేసేవారిలో భయం ఏర్పడుతుందని ప్రతినిధులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల రక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణకు మరింత బలమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.

తెలంగాణలోని పలు పట్టణాలు వరదల బారిన పడుతున్నాయని వారు పేర్కొన్నారు. గతేడాది వరంగల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వచ్చిన వరదలను ఇందుకు ఉదాహరణగా చూపారు. చెరువులు, కుంటలు, వరద కాలువలను ఆక్రమణల నుంచి కాపాడితే పట్టణాల్లో వరద ముప్పును తగ్గించవచ్చని తెలిపారు. పర్యావరణహితమైన తెలంగాణ సాధనకు జలవనరుల పరిరక్షణ కీలకమని పేర్కొన్నారు.

తప్పుడు సమాచారంతో కోర్టులను, ఇతర ప్రభుత్వ శాఖలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రతినిధులు సూచించారు. ప్రజా ఆస్తుల పరిరక్షణలో హైడ్రా చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి హైడ్రా రాష్ట్రవ్యాప్త విస్తరణకు మద్దతు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు