అక్టోబర్ 18 న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ.. వేలాది మంది మహిళలతో వేడుకలు

తెలంగాణ రాష్ట్ర పూల పండుగ బతుకమ్మ వేడుకలను ఈ నెల 10 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చివరి రోజు సద్దుల బతుకమ్మను హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు పలు సూచనలు చేశారు.

3 అక్టోబర్, 2026 5:43 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అక్టోబర్ 18 న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ.. వేలాది మంది మహిళలతో వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 3 (జనవాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. బతుకమ్మ ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈ నెల 18న రాత్రి ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎస్‌ సూచించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలతో పాటు వందలాది మంది కళాకారులు వివిధ కళారూపాలతో ర్యాలీలో పాల్గొననున్నారు. ప్రజాప్రతినిధులు కూడా వేడుకలకు హాజరుకానున్నారు.

TG BATUKAMMA

విద్యుత్‌ దీపాలతో నగర అలంకరణ

బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్‌ చిల్డ్రన్స్‌ పార్కులోని బతుకమ్మ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ డైవర్షన్లు, బారికేడింగ్‌, తాగునీరు, ఇతర కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఎస్‌ తెలిపారు. అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్‌, లైటింగ్‌ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Batukamma Festival

రవీంద్ర భారతిలోనూ వేడుకలు

బతుకమ్మ జరిగే పది రోజుల పాటు రవీంద్ర భారతిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సూచించారు.

ప్రత్యేక లోగో రూపకల్పన

ఈసారి బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నట్లు సంజయ్ జాజు వెల్లడించారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను కూడా ప్రతిబింబించేలా ఈ లోగోను రూపొందించనున్నట్లు తెలిపారు.

Batukamma Festival Tankbund

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు