చెరకు ఉత్పత్తి రెట్టింపు లక్ష్యం.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

తెలంగాణలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచి చక్కెర పరిశ్రమలను పునరుద్ధరించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ప్రోత్సాహక విధానాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.

30 జులై, 2026 1:10 AM•ByRamchandram

Share this article

చెరకు ఉత్పత్తి రెట్టింపు లక్ష్యం.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

తెలంగాణలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు చక్కెర పరిశ్రమలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.

రాష్ట్రంలో చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, చెరకు పంట విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.86 ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చెరకు రైతు ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

50 లక్షల టన్నుల చెరకు అవసరం

రాష్ట్రంలో మొత్తం 12 చక్కెర కర్మాగారాలు ఉండగా ప్రస్తుతం కేవలం 7 మాత్రమే పనిచేస్తున్నాయని సీఎస్ తెలిపారు. అవి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే ప్రతి ఏడాది సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరమవుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు.

చెరకు సాగుకు ప్రాధాన్యం

వరి సాగుతో పోలిస్తే చెరకు సాగుకు తక్కువ నీరు అవసరమవుతుందని, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగు పద్ధతులను అనుసరిస్తే దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయం కూడా తగ్గుతుందని సీఎస్ పేర్కొన్నారు.

2026–27 వ్యవసాయ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 వేల మంది రైతులు 26 వేల హెక్టార్లలో చెరకు సాగు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం

చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచడం, చక్కెర పరిశ్రమలకు అవసరమైన ముడి చెరకు లభ్యతను మెరుగుపరచడం కోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రోత్సాహకాలు, విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను త్వరగా సమర్పించాలని అధికారులను సంజయ్ జాజు ఆదేశించారు.

రైతుల విజ్ఞప్తి

సమావేశంలో పాల్గొన్న రైతు ప్రతినిధులు చెరకు రైతులకు కూడా వరి రైతులకు అందిస్తున్న తరహాలో టన్నుకు రూ.500 ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. చెరకు సాగులో అధిక పెట్టుబడి, వ్యవసాయ కూలీల కొరత ప్రధాన సమస్యలుగా మారాయని వివరించారు.

అదేవిధంగా చెరకు ద్వారా చక్కెరతో పాటు ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమవుతుందని పేర్కొంటూ, ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు