రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఈ-కేవైసీకి గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది.

31 జులై, 2026 1:10 PM•ByRalin

Share this article

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఈ-కేవైసీకి గడువు పొడిగింపు

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఈ-కేవైసీకి గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఆగస్టు 31వ తేదీ వరకు ఈ కేవైసీ చేసుకునేలా అవకాశం కల్పించింది. దీంతో గడువు ముగుస్తుందనే ఆందోళనలో ఉన్న లక్షలాది మంది కార్డుదారులు ఊపిరి పీల్చుకున్నారు.

రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు జూలై 31వ తేదతో ముగియాల్సి ఉంది. కానీ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇంకా వేలాది కుటుంబాలు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో వారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆగస్టు 31 వరకు ఈ కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. ఆగస్టు 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో మూడు నెలలకు సంబంధించిన బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను సరుకులను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు ఆగస్టు 31లోపు ఎప్పుడైనా మూడు నెలల రేషన్‌ను తీసుకోవచ్చు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు