తెలంగాణలో దసరా కానుకగా కొత్త పెన్షన్లు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. అక్టోబర్‌లో కొత్త పెన్షన్లను ప్రారంభించి, దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

22 సెప్టెంబర్, 2026 4:20 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణలో దసరా కానుకగా కొత్త పెన్షన్లు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌లో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తి స్థాయిలో పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

దసరా నాటికి కొత్త పెన్షన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు