తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్ శాఖలోని పలు ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఐదేళ్ల సడలింపుతో కలిపి మొత్తం ఏడేళ్ల వరకు వయోపరిమితి రిలాక్సేషన్ లభించనుంది.

15 ఆగస్టు, 2026 3:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు

హైదరాబాద్, ఆగస్టు 15 (జనవాణి): తెలంగాణ పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. పోలీస్ శాఖలో ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న ఐదేళ్ల వయోపరిమితి సడలింపునకు అదనంగా మరో రెండేళ్ల రిలాక్సేషన్ కల్పించింది. దీంతో అర్హత వయోపరిమితిలో మొత్తం ఏడేళ్ల వరకు సడలింపు లభించనుంది.

ఈ తాజా వయో సడలింపు సివిల్ పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని పలు పోస్టులకు వర్తించనుంది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) జారీ చేసే సంబంధిత నోటిఫికేషన్లకు కూడా ఈ సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పోస్టులకు వర్తింపు

SCT PC (Civil), సమాన స్థాయి పోస్టులు

SCT SI (Civil), సమాన స్థాయి పోస్టులు

SCT PC (Mechanic)

SCT PC (Driver)

SCT SI (FPB)

దరఖాస్తు తేదీలు

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 19 ఉదయం 8 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, పోస్టుల వివరాలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి సమాచారాన్ని TSLPRB అధికారిక వెబ్‌సైట్ www.tgprb.inలో తెలుసుకోగలరు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు