ట్రంప్‌కు అమెరికా టీవీ చానళ్ల షాక్.. అధికారిక కార్యక్రమాలకు నో కవరేజీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రముఖ టెలివిజన్‌ వార్తా సంస్థలు షాక్‌ ఇచ్చాయి. అధ్యక్ష భవనం కార్యకలాపాలను కవర్‌ చేసే మీడియా సంస్థలపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు కవరేజీ ఇవ్వకూడదని టెలివిజన్‌ పూల్‌ కన్సార్టియం నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ట్రంప్‌ పాల్గొనే కార్యక్రమాలకు కూడా ఈ నిర్ణయం వర్తించనుంది.

22 సెప్టెంబర్, 2026 12:55 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ట్రంప్‌కు అమెరికా టీవీ చానళ్ల షాక్.. అధికారిక కార్యక్రమాలకు నో కవరేజీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రముఖ టీవీ వార్తా సంస్థలు గట్టి షాక్‌ ఇచ్చాయి. అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు ఇకపై కవరేజీ ఇవ్వకూడదని టెలివిజన్‌ పూల్‌ కన్సార్టియం నిర్ణయించింది. ట్రంప్‌ ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలపై విధించిన నిషేధానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అధ్యక్ష భవనం కార్యకలాపాలను కవర్‌ చేస్తున్న సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో సంస్థలు తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయంటూ ట్రంప్‌ ఇటీవల ఆంక్షలు విధించారు. దీనిపై ఆయా సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో ఏబీసీ, సీబీఎస్‌, సీఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌, ఎన్‌బీసీ తదితర ప్రముఖ వార్తా సంస్థలతో కూడిన టెలివిజన్‌ పూల్‌ కన్సార్టియం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు తమ ప్రతినిధులను పంపకుండా, వాటికి కవరేజీ ఇవ్వకూడదని నిర్ణయించింది.

కన్సార్టియం తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న ఫాక్స్‌ న్యూస్‌ జర్నలిస్ట్‌ బ్రయాన్‌ బాటన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో ట్రంప్‌ పాల్గొనే కార్యక్రమానికి కూడా కవరేజీ ఇవ్వబోమని ఆయన తెలిపారు.

మరోవైపు, తమపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో సంస్థలు ట్రంప్‌ ప్రభుత్వంపై సోమవారం కోర్టును ఆశ్రయించాయి. మీడియా స్వేచ్ఛ, అధ్యక్ష భవనం కార్యకలాపాల కవరేజీకి సంబంధించిన ఈ వివాదం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు