ప్రపంచంలోనే లోతైన మెట్రో స్టేషన్ ఇదే..ఇక్కడ ప్రయాణం ఓ సాహసమే!

చైనాలోని చోంగ్‌కింగ్ నగరం మరోసారి తన ప్రత్యేక భౌగోళిక నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి హాంగ్‌యాన్‌కున్ మెట్రో స్టేషన్ భూమి ఉపరితలం నుంచి ఏకంగా 116 మీటర్ల లోతులో నిర్మితమై ప్రపంచంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌కు చేరుకోవాలంటే ప్రయాణికులు వరుసగా దాదాపు 10 ఎస్కలేటర్లను దాటాల్సి ఉంటుంది.

6 అక్టోబర్, 2026 2:37 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ప్రపంచంలోనే లోతైన మెట్రో స్టేషన్ ఇదే..ఇక్కడ ప్రయాణం ఓ సాహసమే!

Deepest Metro Station | సాధారణంగా మెట్రో స్టేషన్లు భూమికి కొద్దిపాటి లోతులోనే ఉంటాయి. కానీ చైనాలోని చోంగ్‌కింగ్ నగరంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడి హాంగ్‌యాన్‌కున్ మెట్రో స్టేషన్ భూ ఉపరితలం నుంచి ఏకంగా 116 మీటర్ల (సుమారు 380 అడుగుల) లోతులో నిర్మించారు. అంటే దాదాపు 40 అంతస్తుల భవనం ఎత్తుకు సమానమైన లోతులో ఈ స్టేషన్ ఉంది.

2022లో ప్రారంభమైన ఈ స్టేషన్‌లోకి ప్రవేశించిన తర్వాత ప్రయాణికులకు అసలు ప్రయాణం మొదలవుతుంది. ప్లాట్‌ఫామ్‌ చేరుకోవాలంటే వరుసగా దాదాపు 10 ఎస్కలేటర్లపై ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక ఎస్కలేటర్‌ దిగిన తర్వాత కొంత దూరం నడిచి మరో ఎస్కలేటర్‌ ఎక్కాల్సి ఉంటుంది. దీంతో భూగర్భంలోకి వెళ్లే ఈ ప్రయాణానికే కొన్ని నిమిషాల సమయం పడుతుంది.

ప్రస్తుతం హాంగ్‌యాన్‌కున్ స్టేషన్‌కు సంబంధించిన ఎస్కలేటర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోల్లో ప్రయాణికులు ఒక ఎస్కలేటర్‌ నుంచి మరో ఎస్కలేటర్‌కు మారుతూ భూగర్భంలోకి మరింత లోతుగా వెళ్తుండటం కనిపిస్తోంది.

Metro Station

చోంగ్‌కింగ్‌లోనే ఎందుకు ఇంత లోతు?

చోంగ్‌కింగ్ నగరం పర్వతాలు, కొండలు, ఎత్తుపల్లాలతో కూడిన సంక్లిష్ట భౌగోళిక ప్రాంతం. ఈ కారణంగానే నగరంలోని రోడ్లు, భవనాలు, రైలు మార్గాల మధ్య భారీ ఎత్తు వ్యత్యాసాలు ఉంటాయి. ఈ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంజినీర్లు హాంగ్‌యాన్‌కున్ స్టేషన్‌ను ఇంత లోతులో నిర్మించాల్సి వచ్చింది. స్టేషన్‌లోని కొన్ని ఎగ్జిట్‌లు సాధారణంగా భూమి సమతలానికి కాకుండా ఎత్తైన రహదారులపైకి దారి తీస్తాయి. చోంగ్‌కింగ్ నగర ప్రత్యేక భౌగోళిక నిర్మాణానికి ఇది మరో ఉదాహరణ.

ఉక్రెయిన్ రికార్డు బద్దలు

హాంగ్‌యాన్‌కున్ స్టేషన్ నిర్మాణంతో ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా ఉన్న ఉక్రెయిన్‌లోని అర్సెనల్నా స్టేషన్ రికార్డు బద్దలైంది. అర్సెనల్నా స్టేషన్ సుమారు 105.5 మీటర్ల లోతులో ఉండగా.. హాంగ్‌యాన్‌కున్ దాదాపు 116 మీటర్ల లోతులో ఉంది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్, ఉత్తర కొరియాలోని ప్యాంగాంగ్ వంటి నగరాల్లోనూ అత్యంత లోతైన మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అయితే చోంగ్‌కింగ్‌లోని హాంగ్‌యాన్‌కున్ స్టేషన్ భౌగోళిక సవాళ్లను అధిగమిస్తూ ఆధునిక ఇంజినీరింగ్ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు