
హుషారు పిట్టలు కాదు ఈ సినిమాకి మసాలా పిట్టలు అని పెట్టాల్సింది ..ఏం సినిమారా బాబు ఇది..
యూత్‌ను టార్గెట్ చేస్తూ బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘హుషారు పిట్టలు’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకోగా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కథ, కథనం కంటే అడల్ట్ కంటెంట్, సిల్లీ సీన్లపైనే ఎక్కువగా ఆధారపడిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.


