మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో భారీ చోరీ కలకలం రేపింది. వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ఓ గోల్డ్ షాప్ షెట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాలతో పాటు బంగారు ఆభరణాలను అపహరించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, FRRO, ఐటీ సెల్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 49 మంది అక్రమ విదేశీయులను గుర్తించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపగా.. మరో 37 మందిని హోల్డింగ్ సెంటర్లలో ఉంచారు. విచారణలో నకిలీ కరెన్సీ, డ్రగ్స్, మోసాలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. హఫీజ్‌పేట్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ఆలయంలోకి కర్రతో ప్రవేశించిన ఓ వ్యక్తి పూజారిపై దాడికి యత్నించడంతో పాటు అమ్మవారి విగ్రహంపై కర్రతో దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. అప్రమత్తమైన భక్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని ఓయో హోటల్‌లో మహిళ హత్య కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి హోటల్‌లో దిగిన శిరీష గదిలో రక్తపు గాయాలతో మృతిచెందిన స్థితిలో కనిపించింది. ఆమెతో వచ్చిన శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయి కనిపించకుండా పోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, హోటల్ రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లేశ్‌తో వినోద్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ శంషాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన 19 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల తన ప్రియుడు కలలోకి వచ్చి తనను దగ్గరకు రమ్మంటున్నాడని కుటుంబ సభ్యులతో చెప్పిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం విషాదాన్ని నింపింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో స్నేహితులే వసీం అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలోనూ ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ ఎక్కుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేష్‌ను విచారించిన పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. చోరీకి నాలుగు నెలల ముందే అతడు పథకం రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. ఆదివారం గార్డులు, ఆర్మీ అధికారుల కదలికలు తక్కువగా ఉంటాయని భావించి అదే రోజును ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ ఓయో హోటల్‌లో మహిళ తీవ్రగాయాలతో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ప్రియుడితో కలిసి హోటల్‌లో దిగిన మహిళ అనంతరం ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఘటన అనంతరం ప్రియుడు శ్రీనివాస రవితేజ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్‌లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో అక్రమంగా డిస్పోజల్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే ఆపరేషన్‌లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని వీఎస్‌టీ స్టీల్ బ్రిడ్జిపై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడిని రాంనగర్ పార్సీగుట్టకు చెందిన మనోజ్‌గా పోలీసులు గుర్తించారు. శివం రోడ్డులోని అపోలో డయాగ్నొస్టిక్స్‌లో అతడు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. కొండాపూర్‌లోని ఓ హోటల్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
‘ఢీ’ డ్యాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్, ‘ఢీ-20’ విన్నర్ రాజు అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకుని, వివిధ అవసరాల పేరుతో సుమారు రూ.12 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవలే పదవీ విరమణ పొందిన హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రిటైర్మెంట్‌పై అసంతృప్తితో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసి.. వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన స్వగ్రామం, యాప్రాల్‌లోని మరో ప్రాంతంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్ర కలకలం రేపాయి. రుణం చెల్లించలేదని ఓ మహిళను బెదిరించడంతో పాటు.. ఆమె పదో తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పంపించారు. డబ్బు చెల్లించకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో డిటోనేటర్ల కలకలం రేగింది. ఫైరింగ్ క్యాంప్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న బకెట్‌ను పోలీసులు తనిఖీ చేయగా 160 డిటోనేటర్లు బయటపడ్డాయి. దీంతో బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్‌లో ప్రేమ విఫలమై ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. అంబర్‌పేటలోని తిరుమలనగర్‌కు చెందిన నిభాష్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించారు. అయితే పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు స్నేహితులకు వాట్సాప్‌లో మెసేజ్ పంపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ తుక్కుగూడలో నర్సు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. యువతిపై అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణైంది. నిందితుడు సనా వుల్లా కూడా నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో కేసులో అత్యాచారం సెక్షన్‌ను చేర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే నకిలీ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. హత్యలకు అడ్డాగా తెలంగాణ మారిందని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు పెరిగాయని విమర్శించారు.