
india,national,news
జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 బెంజ్ కార్లు కాలి బూడిద
రాజస్థాన్‌లోని జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీతాపుర ప్రాంతంలోని బాలాజీ మార్కెట్‌లో ఉన్న ఓ మెర్సిడెస్ బెంజ్ కార్ల వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 8 లగ్జరీ కార్లు, కార్ల విడిభాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మరిన్ని కార్లు మంటలకు ఆహుతి కాకుండా కాపాడారు.
23 సెప్టెం, 20261 min read
